కృష్ణా జలాల విషయంలో ఏపీ-తెలంగాణ మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో విపక్షం ఎలాంటి కామెంట్లు చేయలేదు. ప్రతీ విషయంపై రాజకీయం చేసే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అండ్ కో మౌనం వహిస్తున్నారు. తాజాగా ఏపీ నిటీపారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆడమగ కానీ ఉమా జీవితంలో ఒక్కసారి కూడా నిజాలు మాట్లాడవా? అని విమర్శించారు. పోతిరెడ్డి పాడు నుంచి ఏటా నాలుగు వందల టీఎంసీల నీటిని తీసుకుపోయానని అబద్దాలు చెబుతున్నాడని, టీడీపీ హయాంలో కూడా నాలుగు వందల టీఎంసీలు తీసుకోలేదని అనీల్ పేర్కోన్నారు.
ప్రతీ దానికి ఓ లెక్క ఉంటుంది. నోటికొచ్చిన అంకెలు చెప్పొద్దని విమర్శించారు. పోతిరెడ్డిపాడు అభివృద్ది గతంలో రాజశేఖరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రాజెక్ట్ సామర్ధ్యం పెంచుతున్నామని అనీల్ తెలిపారు. పులివెందకు ఎన్ని నీళ్లు ఇచ్చారో? అక్కడి ప్రజలకు తెలుసునని, అక్కడ ప్రాజెక్ట్ లకు ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు తెలుసునన్నారు. వెలిగొండ టన్నెల్ లో కేవలం రెండు కిలో మీటర్లు తవ్వి 18 కిలోమీటర్లు తవ్వామని చెప్పుకుతిరిగిన పార్టీ మీదన్నారు. పట్టిసీమకు లిప్ట్ పెట్టామని హడావుడి చేసిన బ్యాచ్ మీది. అదికాక పోలవరం 70 శాతం పూర్తిచేసామని కబర్లు చెబుతున్నారు.
70 శాతం పనులు పూర్తిచేసామని నిరూపిస్తే మూతి మీదనున్న మీసం తేసేస్తానని అనీల్ సవాల్ విసిరారు. నన్ను బుల్లెట్ మంత్రి అన్నారుగా…మరి నా స్పీడ్ ను తట్టుకోగలరా అని ఎద్దేవా చేసారు. మీకు దమ్ముంటే పొతిరెడ్డి పాడుపై మీ స్టాండ్ ఏంటో చెప్పి మాట్లాడండని డిమాండ్ చేసారు. ఇక మీ డ్రామా పార్టీ కంపెనీని మూసేసుకోవాల్సిందేనని విమర్శించారు. అలాగే వృద్ధాగా పోయే వరద నీటిని వాడుకుంటామంటే? పక్కరాష్ర్టానికి వస్తున్నా నొప్పేంటే అర్ధం కాలేదని అనీల్ ధ్వజమెత్తారు.