జాన్వీతో అఖిల్… ఇద్దరికి కావాల్సిన హిట్

అక్కినేని యువ హీరో అఖిల్ తాజాగా ఏజెంట్ సినిమాతో బ్లాక్ బస్టర్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అఖిల్ మొదటి సినిమాకంటే అతి పెద్ద ఫ్లాప్ గా ఏజెంట్ మారిపోయింది. కొడుకుని స్టార్ హీరోగా నిలబెట్టాలని కింగ్ నాగార్జున అతనితో ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు చేయిస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో అదృష్టం కలిసి రావడం లేదు.

యాక్టర్ మాత్రం అఖిల్ ఇప్పటికే డాన్స్, యాక్షన్ సీక్వెన్స్, పెర్ఫార్మెన్స్ విషయంలో ప్రూవ్ చేసుకున్నారు. లక్ ఫ్యాక్టర్ కలిసొస్తే మాత్రం కచ్చితంగా బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించేంత ఫేస్ వేల్యూ ఉంది. కథల ఎంపికలో ఎక్కడో తేడా కొట్టడం వలన సక్సెస్ పడటం లేదు. అయితే ఈ సారి మరింత కసిగా సక్సెస్ కొట్టాలని అఖిల్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అతను కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లో ఫాంటసీ కథాంశంతో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని బ్యారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. రాధేశ్యామ్, సాహో సినిమాలకి రైటర్ గా పనిచేసిన అనిల్ కుమార్ ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చెబుతున్నారు. 50 కోట్లకి పైగా బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు Akhil 6 కోసం జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారంట. దీర టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో దేవర తర్వాత జాన్వీ కపూర్ చేయబోయే మూవీ ఇదే అని టాక్. అతిలోక సుందరి కూతురుగా అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఇంకా కమర్షియల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలేదు.

అలాగే కింగ్ నాగార్జున వారసుడిగా వస్తోన్న అఖిల్ కూడా పూర్తిస్థాయిలో తనని స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాడు. నాగార్జున, శ్రీదేవి మాత్రం కలిసి రెండు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరి వారి వారసత్వంతో వస్తోన్న జాన్వీ కపూర్, అఖిల్ కి ధీర మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.