అక్కినేని హీరోల నెక్స్ట్ సినిమాలివే

అక్కినేని ఫ్యామిలీకి గత కొంతకాలంగా సరైన సక్సెస్ పడలేదని చెప్పాలి. కింగ్ నాగార్జున మన్మథుడు 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. తరువాత ఆఫీసర్, ది ఘోస్ట్ మూవీస్ కూడా డిజాస్టర్ జాబితాలో చేరిపోయారు. ఈ మధ్యలో ఒక్క బంగార్రాజు చిత్రం మాత్రం కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఇక నాగ చైతన్యకి కూడా థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, తాజాగా కస్టడీ సినిమాలు డిజాస్టర్స్ గా మారాయి.

ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తర్వాత రెండేళ్ళు కష్టపడి చేసిన ఏజెంట్ మూవీ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. దీంతో ఇప్పుడు తండ్రి కొడుకులు ముగ్గురుకి కూడా సాలిడ్ సక్సెస్ లు కావాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరు కథలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొత్తదనంతో బలమైన ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ అంశాలు ఉండే స్క్రిప్ట్ లపై దృష్టి పెట్టారు.

కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో మలయాళీ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కంప్లీట్ కమర్షియల్ జోనర్ లో ఈ చిత్రం ఉంటుంది. ఇక నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ లో మూవీ చేస్తున్నాడు. అడ్వంచర్ కథతో ఈ మూవీని ఆవిష్కరించబోతున్నారు.

ఇక అఖిల్ అక్కినేని ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో మూవీ చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ కుమార్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే దీనిని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాగ చైతన్య మూవీ కూడా సుమారు 60 కోట్ల బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మింస్తోంది.

మరి అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు మూడు ఈ ఏడాదిలోనే స్టార్ట్ కాబోతున్నాయి. అయితే వీటిలో నాగ చైతన్య మూవీ ముందుగా లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రిలీజ్ విషయంలో మాత్రం నాగార్జున సినిమానే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ రెండింటి తర్వాత అఖిల్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకి రావొచ్చు.