Y.S.Vijayamma: ఆ విషయంలో తల్లిని బ్లాక్మెయిల్ చేస్తున్న షర్మిల…. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

Y.S.Vijayamma: వైయస్సార్ కుటుంబంలో పెద్ద ఎత్తున ఆస్తి వివాదాలు చోటుచేసుకునే విషయం మనకు తెలిసిందే. షర్మిలకు రావలసిన ఆస్తులలో వాటా గురించి ఆమె జగన్మోహన్ రెడ్డి పై పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇలా ఆస్తులు విషయంలో అన్న చెల్లెళ్ల మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. అయితే తన తల్లి మాత్రం వైఎస్ షర్మిలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ మోహన్ రెడ్డి తప్పు కారణంగానే వైయస్ విజయమ్మ షర్మిలకు మద్దతు తెలుపుతున్నారని అందరూ భావించారు.

వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఆరోపణలు చేసిన సతీష్ కుమార్ రెడ్డి, ఏకంగా షర్మిళ పేరెత్తి మరీ కామెంట్స్ చేశారు. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ విజయమ్మకు, షర్మిల, జగన్ ఇద్దరు సమానమేనని తెలియజేశారు.కాకపోతే షర్మిళ, విజయమ్మను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

జగన్ ఎన్ని కష్టాలకైనా తట్టుకోగలిగే శక్తి ఆయనకు ఉందని, అందుకే వైయస్ విజయమ్మ షర్మిలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారని సతీష్ తెలిపారు. ఒకవేళ జగన్ కు విజయమ్మ సపోర్ట్ చేస్తే షర్మిళ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అన్న భయం విజయమ్మలో ఉందన్నారు. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నంత వరకు సరస్వతీ భూములను పంచుకోకూడదని జగన్, షర్మిళ మధ్య అగ్రిమెంట్ ఉందన్నారు. షర్మిళ బ్లాక్ మెయిల్ చేస్తోందని సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇలా షర్మిల బ్లాక్మెయిల్ కారణంగానే వైయస్ విజయమ్మ ఆమెకు మద్దతు తెలుపుతున్నారనే విషయాన్ని ఈయన వెల్లడించడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనగా మారాయి. మరి సతీష్ కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.