R.K.Roja: సినీనటి ఆర్కే రోజా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రోజా అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. ఇక రాజకీయాలలో ఈమె మొదట తెలుగుదేశం పార్టీలోకి చేరి ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అప్పటినుంచి నగరి నియోజకవర్గంలో ఈమె పోటీ చేస్తూ వచ్చారు రెండుసార్లు నగరి నుంచి గెలుపొందిన రోజా గత ఎన్నికలలో ఓటమి పాలయ్యారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సినీ నటుడు బాలకృష్ణ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా ఓటమిపాలైన తర్వాత తిరిగి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇస్తూ ఎన్నో షోలు చేస్తున్నారు. గతంలో కూడా ఈమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు అయితే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు. ఇకపోతే రోజా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
తాజాగా ఈ విమర్శలపై ఆమె స్పందించారు బాలకృష్ణకు మగ అహంకారం ఎక్కువ అని తెలిపారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సినిమాలు చేయొచ్చు అమ్మాయిల నడుము గిల్లొచ్చు.. బ్యాక్ పై కొడుతూ డ్యాన్స్ లు చేస్తే తప్పులేదు కానీ, నేను టీవీ షోలో ఆర్టిస్టుల అందరితో కలిసి డ్యాన్స్ చేస్తే తప్పు వచ్చిందా? అని నందమూరి బాలకృష్ణను ప్రశ్నించారు. ఆయన ఎమ్మెల్యేగా హిందూపురంలో ఎంత అభివృద్ధి చేశారో నిరూపించాలని రోజా ప్రశ్నించారు.
బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్ని సార్లు అసెంబ్లీకి వచ్చారు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాలకృష్ణ నియోజకవర్గంలో ఎంత అభివృద్ది చేశారో కూడా చూపించాలని తను కూడా స్వయంగా వచ్చి బాలకృష్ణ తప్పులను చూపిస్తానని సవాల్ విసిరింది. దమ్ముంటే నాతో ఈ సవాల్ చేయాలని ఛాలెంజ్ చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ కు కూడా ఇదే సవాల్ విసిరింది