ఏ ప్రాంతంలోనైనా ..ఏ రాజకీయ పార్టీలలో ఆధిపత్య పోరు సహజం. ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. సరిగ్గా ఎన్నికల సమయంలో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకువస్తుంటాయి. ప్రస్తుతం రాష్ర్టంలో వైకాపా అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నాయకులే ఒకరిపై ఒకరు కలబడటం జరుగుతోంది. రాయలసీమ సహా రాష్ర్టంలో పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజాగా ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య విబేధాలు మరసారి భగ్గుమన్నాయి. దీంతో టంగుటరులో వైకాపా నాయకురాలు బొడ్డపాటి అరుణ ఆత్మహతయ్యాయత్నానికి పాల్పడ్డారు. టంగుటూరు మండలం వైకాపా సమీక్షా సమావేశానికి వెళ్లిన అరుణని రావూరి అయ్యవారయ్య వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అరుణ తీవ్ర మనస్థాపారనికి గురయ్యారు. ఆ అవమనాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చిన అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆమెను గమనించడంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అరుణ వైకాపా ప్రచార కమిటీ కన్వీనర్ గా కొనసాగుతున్నారు.
మండలంలో నేతలందర్నీ అనుమతించినా అరుణను మాత్రం నిరాకరించడంతో బోవోద్రేకానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో నిద్ర మాత్రలు మింగే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రావూరి అయ్యవారయ్య వర్గీయులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇదే తొలిసారి కాదని, గతంలో పలుమార్లు అరుణని అవమానించే విధంగా ప్రవర్తించినట్లు స్థానిక ప్రజలు చెప్పుకొస్తున్నారు. స్థానిక నేతలు కూడా రావూరి వర్గానికే సపోర్ట్ గా ఉంటుందన్నారని తెలుస్తోంది. పోలీసులు ఆ కోణంలో కూడా కేసు విచారణ చేస్తున్నారు.