ఎంపీ ఘటనతో వైసీపీ పరువు పోయిందిగా.. జగన్ చర్యలు తీసుకుంటారా?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చర్చ జరుగుతోంది. “గోరంట్ల మాధవ్ రాసలీలలు” అంటూ ఆయన గురించి పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఒక మహిళతో గోరంట్ల మాధవ్ నగ్నంగా మాట్లాడినట్టు వీడియో చక్కర్లు కొట్టడం ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ అని స్పష్టం కావడంతో నెటిజన్లు ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అయితే గోరంట్ల మాధవ్ మాత్రం వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ వీడియో అని చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న వీడియో వెనుక పొన్నూరు వంశీ, చింతకాయల విజయ్ ఉన్నారని గోరంట్ల మాధవ్ అనుమానాలను వ్యక్తం చేశారు. ఇది టీడీపీ చేస్తున్న కుట్ర అని తనను ఇబ్బంది పెట్టడం కోసం ఈ వీడియోను క్రియేట్ చేశారని ఆయన తెలిపారు. జిమ్ చేస్తున్న వీడియోలను మార్ఫింగ్ చేశారని ఆయన కామెంట్లు చేశారు.

అయితే టెక్నాలజీ సహాయంతో వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ వీడియోనా లేక ఒరిజినల్ వీడియోనా అనే విషయాన్ని తెలుసుకోవడం కష్టం కాదనే సంగతి తెలిసిందే. ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటనతో వైసీపీ పరువు పోయిందనే చెప్పాలి. ఒకవేళ వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ వీడియో అని తేలితే జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇలాంటి ఘటనల వల్ల వైసీపీ పరువు పోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు మహిళా సంఘాలు సైతం గోరంట్ల మాధవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గోరంట్ల మాధవ్ ను ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరహా వివాదాల విషయంలో జగన్ కఠినంగా వ్యవహరించకపోతే వైసీపీ పాజిటివ్ ఇమేజ్ నెగిటివ్ ఇమేజ్ గా మారే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనల వల్ల రాష్ట్రంలో టీడీపీ ఇమేజ్ పెరుగుతోంది.