YCP: వైయస్సార్సీపి సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ గా ఉండేదో మనకు తెలిసిందే. ఎవరైనా పార్టీ గురించి పార్టీ అధినేత గురించి చిన్న మాట మాట్లాడిన వెంటనే మీడియా సమావేశాలలో పాల్గొంటూ పార్టీకి చెందిన కీలక నేతలు అలాగే సోషల్ మీడియాలో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇతర పార్టీలపై విమర్శల దాడి చేసేవారు. ఇలా ఆంధ్రలో ఉన్న వారు మాత్రమే కాకుండా ఇతర దేశాలలో ఉన్నటువంటి వైసీపీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రత్యర్థులపై రెచ్చిపోయేవారు.
ఇకపోతే ఇటీవల కాలంలో ఒక్కసారిగా వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అందరూ కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. గతంలో ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా వైసీపీకి మద్దతుగా నిలిచేవారు. ఇక మాజీ మంత్రులు అయినటువంటి కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని వంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున భూతులతో రెచ్చిపోయి మీడియా సమావేశాలలో మాట్లాడేవారు.
ఇక ప్రస్తుతం వీరెవరు కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు ఇలా వీరంతా మౌనంగా ఉండటానికి కారణం కూడా లేకపోలేదని తెలుస్తుంది ఇటీవల పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసి ఆయననీ రాష్ట్రమంతా తిప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక కేసులో బెయిల్ దొరికితే మరోచోట కేసు నమోదు చేసే ఆ జైలుకు తరలించేవారు.
ఇలా పోసాని కృష్ణమురళికి టార్చర్ అంటే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం చూపించింది ఇలా తమపై ఎవరైనా విమర్శలు చేస్తే వారికి కూడా ఇలాంటి శిక్ష తప్పదని ఉదాహరణకు పోసాని కృష్ణమురళిని చూపించారు దీంతో ఒక్కసారిగా వైసిపి ఫైర్ బ్రాండ్స్ అందరూ కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.
వైసీపీ తరఫున మాట్లాడితే..ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. ఈ సమయంలో వైసీపీ కీలక ఆదేశాలు జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఏమీ కాదు.. మేమున్నాం.. మీరు మీడియా ముందుకు రావాలని కోరుతున్నప్పటికీ కూడా వైసిపి నేతలు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది.మరి ముందుగా వారి భయాన్ని తొలగించేందుకు వైసీపీ అధినేత ప్రయత్నిస్తారో లేదో చూడాలి.