వైసీపీ పథకాలకు ప్రచారం అవసరమా.. సీఎం జగన్ ఆలోచించాల్సిందే!

దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని స్థాయిలో జగన్ సర్కార్ పథకాలను అమలు చేస్తోంది. మన రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టి ఇతర రాష్ట్రాలు సైతం పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. జగన్ ఎవరెవరి కోసం ఏ పథకాన్ని అమలు చేస్తున్నారో రాష్ట్రంలోని ప్రజలందరికీ దాదాపుగా తెలుసు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వైసీపీ పథకాలు అందుతున్నాయి. అయితే ఈ పథకాలను అమలు చేస్తున్న సమయంలో జగన్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి పత్రికలకు యాడ్స్ ఇస్తున్నారు. జగన్ యాడ్స్ ఇస్తున్న పత్రికలలో సొంత పత్రిక అయిన సాక్షితో పాటు ఈనాడు కూడా ఉంది. అయితే జగన్ పథకాల పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని ఎన్నో కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. జగన్ ఇప్పటికే ప్రకటించిన పథకాలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. పత్రికలు చదివే వాళ్లలో పేద, మధ్యతరగతి వాళ్ల కంటే ధనవంతులే ఎక్కువగా ఉంటారు. జగన్ పథకాల అమలుకు సంబంధించి పేపర్ యాడ్స్ కు దూరంగా ఉంటేనే మంచిదని కొంతమంది సూచనలు చేస్తుండటం గమనార్హం.

జగన్ పొదుపు దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ సాక్షి పత్రికకు యాడ్స్ ఇవ్వడంపై కొంతమంది నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సాక్షి కోసం ఖర్చు చేస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల గురించి జగన్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. వైసీపీ పథకాలకు ప్రచారం అవసరం లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.