Y.S.Jagan: వైయస్ జగన్ ఓటమి ఎదుర్కొని ఏడాది పూర్తి కాకుండానే అప్పుడే ఈయన బయటకు వస్తూ తదుపరి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాత్రం మనదే కావాలనే ఉద్దేశంలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను కూడా ఈయన దాదాపు ఖరారు చేసినట్టే సమాచారం. 2029 లో ఎన్నికలు జరిగినా లేదా జమిలి ఎన్నికలు వచ్చి ముందస్తు ఎన్నికలు జరిగినా అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జులుగా బాధ్యతలు ఇస్తూ ప్రజలలో మమేకం కావాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో వారసులకు కూడా టికెట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇలా వారసులకు టికెట్లు ఇవ్వడం వల్ల కొంతమేర నష్టం జరిగిందని గ్రహించిన ఈయన ఈసారి ఎన్నికలకు మాత్రం వారసులను పూర్తిగా దూరం పెడుతున్నారని, ఇలా వారసులకి కాకుండా సీనియర్ నేతలకే టికెట్లు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులలో భాగంగా ఎవరైతే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చారో వారందరికీ కూడా టికెట్లు కన్ఫామ్ అయినట్టు సమాచారం.
గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, మచిలీపట్నం నుంచి పేర్నినాని, గుడివాడ నుంచి కొడాలి నాని, దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరి, తాడికొండ నుంచి నందిగం సురేష్, సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేట నుంచి విడదల రజని, తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి వారి పేర్లకు ఇప్పటికే ఓకే చెప్పినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇలా నాలుగేళ్ల ముందే జగన్మోహన్ రెడ్డి డైరీలో ఈ నేతలందరూ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నట్టు తెలుస్తోంది.