నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారాన్ని అదిష్టానం సీరియస్ గానే తీసుకున్నట్ల్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు గీత దాటితే వేటు తప్పదని సంకేతాలు పంపినట్లు పార్టీ నేతలు మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇప్పటికే రఘురామకృష్ణం రాజు సర్కాపై అర్ధం లేని ఆరోపణలు, నిందలు మోపారని…అక్కడితే ఆగకపోతే వేటు తప్పదని అదిష్టానం హెచ్చరించింది. ఇప్పటివరకూ ఏం మాట్లాడినా? ఎలా మాట్లాడిన జగన్ పట్టించుకోలేదని..ఇకపై మాత్రం నోరు జారితే వ్వవహారం సీరియస్ గా ఉంటుందని అదిష్టానం వార్నింగ్ బెల్స్ వినిపించింది. అసలు ఆయన సమస్య ఏంటో? అసలైన వ్యక్తులకు చెప్పకుండా మీడియాలో ఇష్టానుసారం మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.
పార్టీలో ఎవరితోనైనా ఇబ్బందులున్నా….సమస్యలున్నా! నేరుగా కలవాల్సిన వాళ్లను కలిసి చెబితే వింటారు గానీ..అదిష్టానమే ఆయన దగ్గకు వెళ్లాలంటే వెళ్లదు కదా అని పార్టీ లో కీలక వ్యక్తులు సూచించారు. పార్టీలో ఉండాలనుకుంటే ఉండొచ్చు..లేకపోతే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు అని చెప్పకనే చెప్పారు. ప్రజల కోసం పార్టీని నడుతపున్నాం తప్పా! పాలకుల కోసం కాదంటూ మండిపడ్డారు. అలాంటి నాయకులు తమ పార్టీకి ఎంత మాత్రం అవసరం లేదని కరాఖండీగా చెప్పేసారు సీనియర్ నేతల్లో ఒకరు. ఇప్పటికే రఘురామకృష్ణం రాజు పై వైకాపా ఎమ్మెల్యేలు మాటల దాడి చేసిన సంగతి తెలిసిందే.
జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన రఘురాం కి ఇప్పుడు గొంతెమ్మ కోర్కెలు ఎక్కువైపోయాయంటూ మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచి చూపించాలని పులువురు ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. వాటికి ధీటుగా రఘురాం కూడా బధులిచ్చారు. మొత్తానికి రఘురాం వ్యవహారం నువ్వా? నేనా? అన్నంత దూరం వరకూ వచ్చింది కాబట్టి ఆయన ఇక పార్టీలో కొనసాగే అవకాశం కనిపించలేదు. దీంతో రఘురాం పార్టీకి ఏ క్షణమైనా గుడ్ బై చెప్పేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.