జగన్ సర్కార్ ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టదు. అదీ భంగపాటు రూపంలో దెబ్బలు తగిలితే అస్సలు తట్టుకోలేదు. దెబ్బకు దెబ్బ…మాటకు మాట తిరిగి! ఇవ్వాల్సిందేనన్న వైఖరిని తొలి నుంచి చూపిస్తూనే ఉందని ఏడాది పాలన లో కొన్ని అంశాల్లో స్పష్టంగా తేటతెల్లమైంది. హైకోర్టు తీర్పులనే సవాల్ చేస్తూ సుప్రీంకి వెళ్లి అక్కడా అక్షింతలు వేయించుకున్న ఘనత జగన్ సర్కార్ కే చెల్లింది. తప్పుని తప్పు అని చెప్పినా మళ్లీ మళ్లీ చేసి అక్షింతలు వేయించుకోవడం పరిపాటిగా మారింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంత చేస్తే ఏముంది! వాటిపైనా విమర్శలు మోయాల్సి వస్తోంది. చట్టంలో లూప్ పాయింట్లను వాడుకుంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుకున్నది మాత్రం యాధావిధిగా చేయగల్గుతున్నారు.
ఏడాది పాలనలో ఏం జరిగింది? చంద్రబాబు కొన్ని కొన్ని విషయాల్లో ఎలా అడ్డు తగిలారు? ఎంతగా సక్సెస్ అయ్యారన్నది ఓ సారి రివ్యూ చేస్తే అర్ధమవుతుంది ఈ విషయం. ఇక ప్రస్తుతం వైకాపా నుంచి బయటకు వెళ్లిపోయిన నర్సాపురం ఎంపీతో ప్రభుత్వం లొల్లి గురించి తెలిసిందే. ఆయన పబ్లిక్ గానే ప్రభుత్వాన్ని కడిగేసారు. ఏపీలో, కేంద్రలోనూ బలమైన పార్టీగా నిరూపించుకున్న వైకాపా ప్రతిష్టను రఘురాం వ్యాఖ్యలతో దించేసాడు. ఆయన నేరుగా వ్యవహారన్ని కేంద్రంతోనే డీల్ చేస్తున్నారంటే? వైకాపా పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇంత చేస్తున్న రఘురాంని వైకాపా అంత ఈజీగా వదిలిపెడుతుందా? అంటే నో డౌట్ అనే చెప్పాలి.
రఘురాంని గట్టిగానే దెబ్బకొట్టాలని వైకాపా ప్లాన్ చేస్తోందని పొలిటికల్ కారిడార్ లో చర్చకొచ్చింది. రఘురాని ఏకంగా పదవి నుంచి దించే క్లాజ్ నే వెతికి పట్టుకుందని టాక్ వినిపిస్తోంది. `వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టుద పార్టీ` అనే అస్ర్తాన్ని వైకాపా అదిష్టానం రఘురాంపై ప్రయోగించబోతుందిట. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా…కొత్త విషయం కాకపోయినా..చాలా మందికి తెలియని విషయమిది. ఇప్పటిదాకా పార్టీని ధిక్కరించిన వారిని ఆయా పార్టీలు సస్పెండ్ చేస్తే.. వారికి ఆపార్టీతో బంధం మాత్రమే తెగిపోయేది. ఆ తర్వాత ఆ నేత స్వచ్ఛగా తన పని తాను చేసుకునేవాడు.
కానీ పై క్లాజ్ ప్రకారం అధినాయకత్వం ముందుకెళ్తే పదవి కూడా పోతుందిట. గతంలో జనతాదళ్ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ పై ఈ నిబంధన ప్రకారమే అనర్హుడిగా ప్రకటించారని అంటున్నారు. అందుకే జగన్ సర్కార్ ఈ క్లాజ్ తో రఘురాంని అన్ని రకాలుగా కొట్టడానికి సిద్దపడుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే రఘురాం ఎంపీగా వైకాపా నుంచి పోటీ చేసి దక్కించుకోలేదన్న సంగతి తెలిసిందే. మరి జగన్ అనుకున్నది జరిగితే నరసాపురం ఉప ఎన్నిక తప్పదు.