Sunny Leone : సన్నీలియోన్‌తో ‘యవ్వారం’: అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అన్నయ్య

Sunny Leone : పోర్న్ స్టార్‌గా వచ్చి, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఐటెం బాంబ్‌గా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది సన్నీలియోన్. సన్నీలియోన్ అనే పేరు వింటే అదో వైబ్రేషన్.. అనేంతలా ఆమె పేరు మార్మోగిపోతుంటుంది. అలాంటి సన్నీలియోన్‌ని సౌత్ సినిమాలకు తీసుకురావడం అంటే, కాస్త ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనే.

అయినా కానీ, ఆమె క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు కొందరు సౌత్ డైరెక్టర్లు, హీరోలు ఆమెకిక్కడ ఛాన్స్ ఇచ్చారు. కానీ, ఆయా సినిమాలకు సన్నీక్రేజ్ ఏమంత వర్కవుట్ కాలేదనుకోండి. మంచు వారబ్బాయ్ మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’ సినిమా కోసం సన్నీలియోన్ మొట్టమొదట తెలుగు సినిమాలో నటించింది.

అయితే, ఆ సినిమా అడ్డంగా దెబ్బయిపోయింది మనోజ్‌కి. సినిమా హిట్ కాలేదు సరికదా.. ఆ సినిమా కోసం సన్నీకి ఊహించని రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇచ్చుకోవల్సి వచ్చింది. ఓ సందర్భంలో ఇదే విషయాన్ని చెబుతూ మనోజ్ చాలా బాధపడ్డాడు.

సరే, తాజా విషయానికి వస్తే, సన్నీలియోన్ మళ్లీ తెలుగు తెరపై సందడి చేయనుంది. ఈ సారి కూడా మంచు వారి సినిమాలోనే. విచిత్రంగా వుంది కదా.. అయితే, అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అన్నయ్య. అదేనండీ మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కోసం సన్నీలియోన్‌ని తీసుకురాబోతున్నారట. ఓ ఐటెం సాంగ్‌తో పాటు రెండు మూడు సీన్లలో సన్నీ నటించబోతోందట.

కానీ, హీరోయిన్‌కి మించిన రెమ్యునరేషన్ తీసుకుంటోందట సన్నీలియోన్. అంతే మరి, సన్నీతో మావులుగా వుండదు. అప్పుడు తమ్ముడు చెప్పిన డైలాగే సినిమా రిలీజ్ తర్వాత అన్నయ్య చెప్పనున్నాడా.? అంటూ సినీ ప్రియులు సెటైర్లు వేస్తున్నారు. అన్నట్లు సన్నీలియోన్ ‘గరుడవేగ’ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు, సినిమా కూడా మంచి విజయం అందుకుంది.