GIPPA GIPPA Item Song: సన్నీ లియోన్ నటించిన ‘త్రిముఖ’ నుంచి భారీ బడ్జెట్ ఐటెం సాంగ్ ‘గిప్పా గిప్పా’ షూట్ పూర్తి

అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ మోహన్ మరియు శ్రీవల్లి సమర్పణ లో యోగేష్ కల్లే, సన్నీ లియోన్, ఆకృతి అగర్వాల్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, ఆశు రెడ్డి, చిత్రం శ్రీను, షకలక శంకర్ ముఖ్య తారాగణం తో రాజేష్ నాయుడు దర్శకత్వం లో డాక్టర్ శ్రీదేవి మద్దాలి. మరియు డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాణం లో భారీ అంచనాలతో రాబోతున్న చిత్రం ‘త్రిముఖ’.

అయితే ఇటీవలే ఈ చిత్రం లోని “గిప్పా గిప్పా” అనే ఐటెం సాంగ్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. యోగేష్ కల్లే, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ పాట, సినిమా ప్రపంచంలో ట్రేండింగ్ అవటానికి సిద్ధం అవుతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ పాట తెలుగు ప్రేక్షకులకి సరికొత్తగా ఉంటుంది మరియు కనుల పండుగగా ఉంటుంది.

ఈ పాటలో సన్నీ లియోన్ తో పాటు సాహితీ దాసరి (పొలిమేర ఫేమ్) మరియు ఆకృతి అగర్వాల్ వంటి అద్భుతమైన నటీమణులు తమ అందచందాలతో అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకులను రంజింప చేస్తారు. సన్నీ లియోన్‌తో పాటు 10 మందికి పైగా సినీ ప్రముఖులు నృత్యం చేయడంతో ఇది ఒక స్టార్-డస్టడ్ ఎక్స్‌ట్రావగాంజాగా మారింది.

నిర్మాతలు ఈ నెల చివర్లో అధికారిక విడుదల తేదీని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు, మరియు ‘త్రిముఖ’ త్వరలోనే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతుంది.

రమణానంద మహర్షి కేసు | SiddaGuru Ramanananda Maharshi Controversy EXPOSED By Analyst Rahul Iyyer | TR