సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన ‘త్రిముఖ’ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతగా సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ‘త్రిముఖ’ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కేవలం ఇన్ స్టా హ్యాండిల్‌లోనే ఈ టీజర్ కోటి వ్యూస్‌ను దక్కించుకుంది. ఇలా కోట్ల వ్యూస్‌తో ‘త్రిముఖ’ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఈ అద్భుతమైన స్పందనతో ‘త్రిముఖ’ మీదున్న బజ్ మరింతగా పెరిగింది. టీజర్‌ను చూస్తుంటే సినిమా స్టాండర్డ్స్, క్వాలిటీ, విజువల్స్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.
త్రిముఖ మీద ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమకు చిత్ర యూనిట్ ప్రతి స్పందిస్తూ.. ‘‘త్రిముఖ’ టీజర్‌పై కురిపిస్తున్న అద్భుతమైన ప్రేమతో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రోజులోనే 1 కోటి వ్యూస్‌ను దాటడం ఒక కలగా ఉంది. ఇది మా టీం పడిన కృష్టికి, కష్టానికి నిదర్శనం. మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందని, ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని మరోసారి ఈ స్పందన చూస్తుంటే అర్థం అవుతోంది’ అని అన్నారు.

సాంప్రదాయ కథ చెప్పే సరిహద్దులను అధిగమించే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన కథనంగా ‘త్రిముఖ’ అవుతుందని టీం హామీ ఇస్తుంది. ‘త్రిముఖ’ ఫస్ట్ లుక్, టీజర్ అద్భుతమైన విజయం సినిమా ప్రయాణానికి బలమైన పునాది వేసింది. ఇక త్వరలోనే రానున్న ట్రైలర్, థియేట్రికల్ విడుదల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘త్రిముఖ’ భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
తారాగణం: సన్నీ లియోన్, యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆశు రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : అఖిరా డ్రీమ్ క్రియేషన్స్
నిర్మాతలు: శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి
దర్శకుడు: రాజేష్ నాయుడు
అసోసియేట్ డైరెక్టర్: షేక్ రబ్బానీ
ప్రొడక్షన్ డిజైనర్ : సుమిత్ పటేల్ ఒడెలా.
ప్రొడక్షన్ కంట్రోల్: PV చౌదరి
ఎడిటర్: RK, అఖిల్ బలరామ్
సౌండ్ డిజైన్: శ్రీను నాగపురి
డాన్స్ కొరియోగ్రఫీ: బాబీ మాస్టర్.
స్టంట్ కొరియోగ్రఫీ: కృష్ణ మాస్టర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి అల్తి
పీఆర్వో : పాల్ పవన్

