Trimukha Title Motion Poster: యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “త్రిముఖ” టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల

మనసును కదిలించే థ్రిల్లర్‌గా రూపొందుతున్న “త్రిముఖ” చిత్రం నుంచి టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో యోగేష్ కల్లే, సన్నీ లియోన్, ఆకృతీ అగర్వాల్, మొట్టా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది.

టైటిల్ మోషన్ పోస్టర్‌లో ప్రతి ఫ్రేమ్ కూడా సస్పెన్స్‌తో నిండి ఉంది. ఒక మానవ మెదడు, దాని చుట్టూ చుట్టుముట్టిన విద్యుత్ కరెంట్ వేగం, రహస్యాలతో నిండిన కన్ను, దురుద్దేశంతో ఉన్నట్లు కనిపించే సూది, చివరగా రెండు ఉగ్ర గద్దల మధ్య ఉత్కంఠ పుట్టించే చీకటి శైలి అని కలిసి త్రిముఖ ఒక సైంటిఫిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటుంది.

“ఇది సాధారణ పోస్టర్ కాదు, ఈ పోస్టర్ త్రిముఖ చిత్రం పైన కొంత ఆసక్తి కలుగజేస్తుంది. పోస్టర్ లాగానే మా చిత్రం కూడా అంత కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

త్రిముఖ ఒక రహస్య కథ. ఒక మానసిక ప్రయాణం. ఒక నమ్మలేని వాస్తవం. త్వరలో థియేటర్లలో వాస్తవాన్ని చూపేందుకు సిద్ధమవుతోంది!

తాట తీస్తానాన్న పవన్ ఎక్కడ?? || Varudu Kalyani Fires On Pawan Kalyan || Telugu Rajyam