మన దగ్గర ఏకైక హీరోగా యష్..”కేజీఎఫ్ 2″ తో అరుదైన రికార్డ్ తన సొంతం.!

Record of KGF 2 : ఈ ఏడాదిలో పాన్ ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలు తెచ్చి పెట్టిన చిత్రాల్లో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ చాప్టర్2 కూడా ఒకటి. కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి భారీ రికార్డు నెలకొల్పింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సంచలన విజయం అందుకొని కొన్న రేటు కన్నా డబుల్ లాభాలు అందించింది.

మరి ఇదే ఇప్పుడు ఏ ఇతర భాష హీరోకు కూడా లేని ఒక అరుదైన రికార్డ్ ను యష్ కు తెచ్చి పెట్టింది అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. నిజానికి మన తెలుగు లో తెలుగు టాప్ హీరోలకే లేని 100 కోట్ల షేర్ క్లబ్ లోకి ఈ చిత్రం చేరిపోయింది. మంచి వసూళ్లను అయితే ఈ సినిమా అందుకుంటుంది అని అంతా అనుకున్నారు కానీ ఇలా 100 కోట్ల షేర్ ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లో నే రాబడుతుంది అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.

దీనితో ఈ సినిమా సెన్సేషనల్ రికార్డ్ అందికోగా ఈ రికార్డ్ అందుకున్న పర భాషా హీరోగా యష్ నిలిచాడు. మొత్తానికి అయితే మన తెలుగు వాళ్ళు ఇలా క్రొత్త రికార్డు అందించారు. ఇంకా ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా రవీనా టాండన్ సంజయ్ దత్ మరియు ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే రవి బాసృర్ సంగీతం అందివ్వగా హోంబలే ఫిల్మ్ వారు నిర్మాణం అందించారు.