Yandamuri: యండమూరి సెట్లో సిగరెట్ తాగితూ డైరెక్షన్ చేస్తారు… ఏమని అడిగితే…

Yandamuri: మామూలుగానే యండమూరి గారిని చూసి చాలా నేర్చుకోవచ్చని, అలాంటి తాను ఆయనతో కలిసి సినిమా మొత్తం ప్రయాణం చేసిన తాము ఇంకా చాలా నేర్చుకున్నామని నటుడు కౌశల్ మండా అన్నారు. తాను చాలా మంది కొత్త మరియు పాత జనరేషన్‌ డైరెక్టర్లతోనూ కలిసి పని చేశానని ఆయన తెలిపారు. ఒక జనరేషన్‌లో ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసిన డైరెక్టర్ల నుంచి మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. అలా తాను స్ర్కిప్ట్ పరంగా గానీ, యాక్టింగ్ పరంగా గానీ, లొకేషన్‌లో షాట్‌కీ షాట్‌కి మధ్య తామతో యండమూరి గారు ఎంజాయ్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించిందని ఆయన చెప్పారు.

అంటే తాము కెమెరా ముందు ఏమీ చేయకుండా అక్కడికెళ్లి ఒక్క షాట్ చేశామా, సింగిల్ టేక్‌లో కొట్టామా, వచ్చామా, మళ్లీ దమ్మేసుకున్నామా, నెక్స్ట్ షాట్ గురించి మాట్లాడుకున్నామా… అలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ సినిమాను పూర్తి చేశామని కౌశల్ తెలిపారు.

ఇకపోతే ఈ సినిమా షూట్‌ చేస్తున్నపుడు ఏ సీన్‌ కూడా సెకండ్ టేక్ చేయలేదని డైరెక్టర్ యండమూరి అన్నారు. సినిమా షూటింగ్ మొత్తంలో ఎప్పుడూ కూడా మళ్లీ చేద్దాం అని తన ఆర్టిస్ట్‌ల దగ్గర్నుంచి రాలేదని ఆయన గొప్పగా చెప్పారు. అంతే కాకుండా ఒక్క షాట్ కూడా ఎడిటింగ్‌లో తీసివేయలేదని, ప్రతీ సీన్‌ను సినిమాలో పెట్టామని ఆయన స్పష్టం చేశారు.ఇకపోతే యండమూరి గారు ఎప్పుడు సిగరెట్ తాగుతూనే డైరెక్షన్ చేస్తారని అదేంటి అలా అని ప్రశ్నించినప్పుడు తనకు సిగరెట్ ఉన్నప్పుడే ఆలోచనలు వస్తాయని చెబుతారంటూ కౌశల్ ఈ సందర్భంగా తెలిపారు.