Y.S.Vimala Reddy: రాజకీయాలలోకి జగన్ కూతురులు… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగన్ మేనత్త!

Y.S.Vimala Reddy: సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో వారసత్వం అనేది తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. ప్రతి రంగంలోనూ వారసత్వం కొనసాగడం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయాలలో మాత్రం ఓకే కుటుంబానికి చెందిన వారసులను ప్రజలు ఎన్నుకోవడం అనేది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే రాజకీయాలలో కేసీఆర్ ఫ్యామిలీ నారా నందమూరి కుటుంబాలు వైయస్సార్ కుటుంబాలు తరతరాలుగా రాజకీయాలలో కొనసాగుతూ వస్తున్నారు.

ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఈయన తన తండ్రి హయామంలో ఎంపీగా ఉన్నప్పటికీ తన తండ్రి మరణం తర్వాత ఎంపీగా రాజీనామా చేసి అనంతరం పార్టీ పెట్టి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా సక్సెస్ అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికలలో జగన్ ఘోర ఓటమి పాలయ్యారు. ఇక మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతూ ఉండగా తన కుమారుడు మంత్రి హోదాలో నారా లోకేష్ పూర్తి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు.

ఇక జగన్మోహన్ రెడ్డికి కొడుకులు లేరు కాబట్టి జగన్ తర్వాత తదుపరి తన కూతుర్లు ఇద్దరు రాజకీయాలలోకి వస్తారా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి అయితే ఈ సందేహాలకు వైయస్ జగన్ మేనత్త విమలారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా విమలారెడ్డి మాట్లాడుతూ… జగన్ పిల్లలు ఇద్దరూ ఎవరి రెఫరెన్స్ లు కానీ రికమండేషన్లు కానీ లేకుండా ఎంతో మంచిగా చదువుకుంటున్నారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ లండన్ లోనే చదువుతున్నారు ఇటీవల పెద్దమ్మాయికి ఉద్యోగం కూడా వచ్చింది.

ప్రస్తుతం అమ్మాయిలు ఇద్దరు ఎంతో మంచిగా ఉన్నత చదువులు చదువుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక రాజకీయాలలోకి రావడం అనేది పూర్తిగా వారి ఇష్టమని తెలిపారు. భవిష్యత్తులో వారు రాజకీయాలలోకి రావాలి అనుకున్న అది ప్రజా తీర్పును బట్టి ఉంటుందని విమల తెలిపారురాజకీయాలలోకి. జగన్ అయినా కూడా ప్రజా అనుమతితోనే రాజకీయాలలో సక్సెస్ సాధించారని తెలిపారు. ఇక భారతి ఇద్దరు పిల్లల్ని చాలా చక్కగా పెంచింది ప్రతి సందర్భంలోనూ జగన్ కి తోడుగా ఉంటున్నారు వ్యాపారాలను చూసుకుంటున్నారు కానీ రాజకీయాలలోకి మాత్రం ఆమె అసలు జోక్యం చేసుకోరు అంటూ విమలారెడ్డి తెలిపారు.