‎Kishkindhapuri: కిష్కింధపురి లాంటి హారర్ సినిమా ఇప్పటివరకూ రాలేదు: బెల్లంకొండ శ్రీనివాస్

‎Kishkindhapuri: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. ఈ సినిమాలో అనుపమ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో అనగా సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగానే తాజాగా విలేకరులతో ముచ్చటించారు.

‎ ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చాలా ఇష్టం. డైరెక్టర్ కౌశిక్ కలిసినప్పుడు కూడా మేము ఇదే మాట్లాడుకున్నాము. అప్పుడు కిష్కింధపురి కథ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చేసాము. నిన్న ఫస్ట్ టైం థియేటర్స్ లో చూసాము. సినిమా అదిరిపోయింది.

‎ముఖ్యంగా సౌండ్. సలార్ యానిమల్ కాంతారా సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ గారు సౌండ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాము. థ్రిల్లర్ జానర్ లో చేసిన రాక్షసుడుకి చాలా మంచి అప్లోజ్ వచ్చింది. మహిళ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకి గొప్ప ఆదరణ లభించింది. చాలా రోజుల తర్వాత కిష్కింధపురి తో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఖచ్చితంగా కిష్కింధపురి ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది అని చెప్పుకొచ్చారు హీరో సాయి శ్రీనివాస్. అలాగే ఆయన మాట్లాడుతూ.. హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడో చూడలేదు. హారర్ మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా ఇది. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అని తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.