Y.S.Jagan: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రతినెల రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా జగన్మోహన్ రెడ్డి తాజాగా నేడు చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరామర్శ కోసం వెళ్తున్నారు. మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని ఈ సమస్యను పరిష్కరించాల్సిన కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్వయంగా నేడు జగన్ మామిడి రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనకు వెళ్ళకముందే మామిడి రైతుల సమస్య దాదాపు తీరిపోయిందని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. జగన్ వల్ల రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి సర్కార్ అచ్చెన్నాయుడును ఢిల్లీకి పంపించి మామిడికి గిట్టుబాటు ధర కల్పించే దిశగా అడుగులు పడటం హాట్ టాపిక్ అవుతోంది.
ఇలా అచ్చం నాయుడు ఢిల్లీకి పంపించి మామిడికి గిట్టుబాటు ధర కల్పించే దిశగా అడుగులు వేయడంతో రైతుల సమస్య దాదాపు తీరినట్టేనని చెప్పాలి. ఇలా జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించక ముందే వారి సమస్య తీరిపోతుంది అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ రాకుండా కూటమి సర్కార్ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తోంది.జగన్ ను నెటిజన్లు సైతం ఎంతగానో మెచ్చుకుంటున్నారు. జగన్ ఏ సమస్యపై దృష్టి పెడితే ఆ సమస్య వేగంగా పరిష్కారం అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక జగన్మోహన్ రెడ్డి నేడు చిత్తూరు పర్యటనలో ఉన్నారు మరి ఈ పర్యటనకు పెద్ద ఎత్తున పోలీస్ ఆంక్షలు కండిషన్లు కూడా ఉన్నాయి. కేవలం 500 మంది మాత్రమే ఈ పర్యటనలో పాల్గొనడానికి పోలీసులు అనుమతి తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటే జన సునామి ఉంటుంది. మరి ఈ చిత్తూరు జిల్లా పర్యటనకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలియాల్సి ఉంది.
