Y.S.Jagan: ఈ ఏడాది ఏప్రిల్ 8న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనకు వచ్చారు. హెలికాఫ్టర్ దిగగానే ఒక్కసారిగా జనం హెలికాప్టర్ వద్దకు దూసుకు వెళ్లడంతో హెలికాప్టర్ విండో గ్లాస్ విరిగిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న నేపథ్యంలో హెలికాప్టర్ మాత్రం తనని అక్కడ వదిలేసి తిరిగి వెళ్ళిపోయింది. ఇలా వెళ్లిపోవడంతో జగన్మోహన్ రెడ్డి చేసేదేమి లేక తిరిగి బెంగళూరుకు రోడ్డు మార్గాన వెళ్లిపోయారు.
ఇలా జగన్మోహన్ రెడ్డిని హెలికాప్టర్ అక్కడే వదిలి వెళ్ళపోవడంతో ఇద్దరు పైలట్లను అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ విచారణలో భాగంగా పైలెట్ లు సంచలన విషయాలను బయటపెట్టారు.జగన్ ను వదిలేసి ఎందుకు ఆ రోజు వెళ్లిపోవాల్సి వచ్చిందన్న దానిపై విచారణకు పోలీసులు పలుమార్లు పిలిచినా పైలట్ రాలేదు. ఎట్టకేలకు ఇవాళ చెన్నేకొత్తపల్లి పీఎస్ లో విచారణకు పైలట్ అనిక్ హాజరయ్యారు.
ఇప్పటికే కో ఫైలెట్ శ్రేయాస్ జైన్ ను విచారించిన పోలీసులు.. ఇవాళ పైలట్ అనిల్ ను అన్ని విధాలుగా ప్రశ్నించారు. దీంతో ఏప్రిల్ 8న తాను వీఐపీ అయిన జగన్ ను వదిలేసి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. మేము మా హెలికాప్టర్లో విఐపి అయిన జగన్మోహన్ రెడ్డిని తీసుకొని అక్కడికి వచ్చాము అయితే హెలికాప్టర్ ల్యాండ్ అయిన క్షణాలలోనే జనాలు ఒక్కసారిగా గూమికూడి హెలికాప్టర్ పై పిడుగుద్దుల వర్షం కురిపించారు.దీంతో సైడ్ మిర్రర్ విరిగిందని తెలిపారు. ఇదే విషయాన్ని ఏవియేషన్ సంస్ధకు చెప్పామని, అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇలా వెళ్లిపోయినట్లు వెల్లడించారు
అలాగే గాల్లోకి ఎగిరితే ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రిటర్న్ లో జగన్ ను తీసుకెళ్లకుండా తానొక్కడినే తిరిగి వెళ్లిపోయానని పైలెట్ తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు మీరు వెళ్తే కూడా ప్రమాదం కదా అనే ప్రశ్న కూడా ఎదురయింది. తాము హెలికాఫ్టర్ ముందు భాగంలో ఉంటాం కాబట్టి కనీస సామాగ్రి జాబితాతో తాము టేకాఫ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి అలా బయలుదేరి వెళ్లిపోయినట్లు తెలియజేశారు.