Y.S.Jagan: అధర్మం తాత్కాలికం… ధర్మం శాశ్వతం… జగన్ ట్వీట్ వెనుక మర్మం ఏమిటి?

Y.S.Jagan: నేడు దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ట్విట్టర్ వేదికగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. జగన్ చేసిన ఈ ట్వీట్ పులివెందుల జడ్పిటిసి ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి చేశారు అంటూ మరికొందరు ఈ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..”అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకు వెళ్లిన అది శాశ్వతం. శ్రీకృష్ణుడి జీవితం ఇందుకు నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు” అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ట్వీట్ పరోక్షంగా పులివెందుల జడ్పిటిసి ఎన్నికలను ఉద్దేశించి చేశారని మరికొందరు భావిస్తున్నారు.

ఇటీవల పులివెందులలో జరిగిన జడ్పిటిసి ఎన్నికల ఫలితాలలో టిడిపి భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. జడ్పిటిసి ఉప ఎన్నికలలో మా రెడ్డి లతారెడ్డి6,035 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా వైసిపి డిపాజిట్లను కూడా కోల్పోయారు. అయితే ఈ ఎన్నికలు సజావుగా జరగలేదని కేవలం ఓటర్లను కూడా పోలింగ్ బూత్ లోకి అనుమతించకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఓట్లు వేసుకున్నారంటూ ఆరోపణలు కూడా చేశారు. ఇక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆధర్మం ఎంత బలంగా ఉన్నా తాత్కాలికమే ధర్మం నెమ్మదిగా వెళ్లిన శాశ్వతం అంటూ ట్వీట్ చేశారని భావిస్తున్నారు. ప్రస్తుతం జగన్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.