మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే మహిళలు మగవారితో పోటీపడి ఎన్నో రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మగవారు చేసే అన్ని పనులను స్త్రీలు చేస్తున్నారు. అయితే కొందరు మహిళలు మాత్రం నేరాలు చట్టవిరుద్ధమైన పనులు చేయడంలో కూడా పురుషులను ఫాలో అవుతున్నట్టున్నారు.గత లాక్ డౌన్ అనంతరం వైన్స్ షాపులు తెరిచిన వెంటనే షాపుల ముందు బారులు తీరిన మహిళలను చూశాం. అక్కడక్కడ మహిళలు మందుకొడుతూ కనిపించే ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
నిజానికి మందు తాగడం మనదేశంలో చట్టవిరుద్ధమైన పనిఏమీ కాదు. అది ఆరోగ్యానికి హానికరం కాబట్టి తాగొద్దని వైద్యులు చెబుతుంటారు. కానీ చట్టప్రకారం.. 21 నిండిన వాళ్లు ఎవరైనా మద్యం కొని తాగొచ్చు. ప్రభుత్వాలు ఓ వైపు మద్యం తాగొద్దని ప్రచారం చేస్తూ మరోవైపు కేవలం ఎక్సైజ్ ఆదాయంతోనే బతుకుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజమే.
అయితే ఇప్పుడు తాజాగా కొందరు మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. ఈ అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేకాట క్లబ్బులపై సీరియస్గా దృష్టిపెట్టింది. రాష్ట్రంలో పేకాట స్థావరాలు ఉండొద్దని జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. అయితే తాజాగా విజయనగరంలో పోలీసులు రైడ్లు నిర్వహించగా కొందరు మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారంతో విజయనగరం ఉమెన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ నేతృత్వంలో రైడ్ చేసిన తొమ్మిది మంది మహిళలను అరెస్ట్చేశారు. వారి నుంచి 30 వేల 300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.