ఆ మహిళా మంత్రికి 3 నెలల జైలుశిక్ష విధించిన కోర్టు.. చట్టమా మజాకా.. ?

 

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం దొంగ దొరై తిరగడం అంటూ ఉన్న ఈ పాట ప్రస్తుత సమాజంలో అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది.. నిజానికి మనుషులకు న్యాయం పట్ల గౌరవం, తప్పుచేయాలంటే ఒంట్లో భయం ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే చట్టం, న్యాయం తమ పని తాము చేసుకుంటూ వెళ్లుతాయి.. ఇకపోతే ప్రస్తుత కాలంలో అన్యాయం, అవినీతి రాజ్యాలను ఏలుతుంది అని ప్రతి చోట నిరూపించబడుతుంది.. పదవిలోకి రాక ముందు ఓటర్ల దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నంత పని చేస్తారు.. అధికారం చేతిలో పడగానే ఈడ్చితంతారు.. ప్రతి చోట రాజకీయ దళారులు ప్రజలను పీడించుకు తినడం సర్వసాధారణం అయ్యింది.. కానీ వీరి ఆగడాలు అన్ని వేళల పనిచేయవని నిరూపించే సంఘట ఇప్పుడు మనం చదవబోయేది.. ఆ వివరాలు చూస్తే..

మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖామంత్రి యశోమతి ఠాకూర్‌ విధుల్లో ఉన్న పోలీసు మీద చేయి చేసుకోన్నది.. దీంతో బాధిత పోలీసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అమరావతి పోలీసులు మంత్రి యశోమతిపై కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.. ఈ కేసులో మంత్రితో పాటు మిగతా వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ మేరకు ఆమెకు 3 నెలల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధించిందట కోర్టు.. ఇక చేతిలో అధికారం ఉందని దుర్వినియోగానికి పాల్పడితే చట్టాలు ఊరుకోవు కదా. ఈ మహిళా మంత్రి విషయంలో అదే జరిగింది.. కాగా ఎనిమిదేళ్ల క్రితం యశోమతి ఠాకూర్ అమరావతి జిల్లాలోని అంబాదేవి ఆలయం సమీపంలో ఉల్హాస్ రౌరాలే అనే పోలీసు మీద చేయి చేసుకున్నారట.. కానీ ఈ కేసులో తీర్పు ఆలస్యంగా వచ్చినా తప్పుచేసిన ఆ మంత్రి మాత్రం తప్పించుకోలేక పోయింది..

ఇక మహారాష్ట్రలోని తేవ్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యశోమతి ఠాకూర్ ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ, కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు అప్పీల్ చేస్తాను. బీజేపీ నాయకులు నా కెరీర్‌ను అణగదొక్కాలని అనుకుంటున్నారు. అందుకే నా రాజీనామా డిమాండ్‌ చేస్తున్నారు అంటూ పేర్కొనడం హస్యస్పదం అని అంటున్నారట.. నిజానికి ఒక మంత్రికి శిక్షపడటం మెచ్చుకోవలసిన అంశమే కానీ అన్ని చోట్ల తప్పు చేసిన నాయకుల విషయంలో న్యాయస్దానం వేగంగా స్పందించి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే సామాన్యుని దృష్టిలో కూడా చట్టమంటే చుట్టం కాదనే అభిప్రాయం వస్తుంది.. కానీ ఇలా జరగడం కల మాత్రమే..