Allu Aravind: ఇలా చేస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందే…. మాస్ వార్నింగ్ ఇచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదని చెప్పాలి ఈ సినిమా విడుదలైన మరుసటిరోజే HD ప్రింట్ బయటకు రావడంతో నిర్మాతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏకంగా ఈ సినిమాని ఆర్టీసీ బస్సులలో కూడా వేయటంతో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమా పైరసీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ…నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వలన కొన్ని ఏళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ గత రెండు నెలలుగా పైరసీ అనే పిశాచి మళ్లీ మొదలైంది. నెల నుండి అయితే ఇంకా ఎక్కువగా అయిందని తెలిపారు. దిల్ రాజు నిమాలను కూడా ఇలాగే పైరసీలలోనే చాలామంది వీక్షించారు ఇప్పుడు తండేల్ విషయంలో కూడా అదే జరుగుతుందని తెలిపారు.

పైరసీని ఆపడానికి నిరంతరం ఫిల్మ్ ఛాంబర్ లు కష్టపడుతున్నాయి. కొందరు వాట్సప్‌ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్‌ చేస్తున్నారు. అలాగే మిగితా సోషల్ మీడియా వాటిలలో కూడా పైరసీ లింక్స్ షేర్ చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే తప్పనిసరిగా సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకు వెళ్తామని, ఇలా పైరసీలకు పాల్పడే వారికి సరైన శిక్ష విధిస్తూ జైలుకు పంపిస్తాము అంటూ అల్లు అరవింద్ తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. అయితే సినీ నిర్మాతలు ఎంతో కట్టడి చేసినప్పటికీ ఇలా పైరసీలు మాత్రం ఆగడం లేదని చెప్పాలి . సినిమా విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే సినిమా బయటకు రావడంతో చాలామంది థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లో కూర్చునే సినిమాలు చూస్తున్నారు. తద్వారా నిర్మాతలకు కూడా పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని చెప్పాలి.