Nara Lokesh: మంత్రి నారా లోకేష్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు ఏమాత్రం ఇబ్బందులకు గురి చేయొద్దు అంటూ వారికి సూచనలు చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం పై లోకేష్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో జరిగే పోలిట్ బ్యూరో సమావేశానికి కొంతమంది పోలీసులు హాజరు అయ్యారు. అయితే ఈ పార్టీ సమావేశానికి కూడా ఇంతమంది పోలీసులు ఎందుకు వస్తున్నారు? ఇదేమైనా వైసిపి ప్రభుత్వం అనుకున్నారా అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ప్రస్తావిస్తూ ఈయన పోలీసులపై మండిపడ్డారు.
ఇలా పార్టీ ఆఫీసు వద్దకు కార్యకర్తలు వస్తున్నారు అంటే వారందరూ కూడా తమ సమస్యలను అధికారులతో చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తారు అలాంటి వారిని పోలీసులు అడ్డుకోవడం భావ్యం కాదని తెలిపారు. అయినా ఇక్కడ ఎంతమంది పోలీసులు ఎందుకు ఉన్నారు అంటూ లోకేష్ ప్రశ్నించారు. కార్యకర్తలు ఇక్కడికి వారి సమస్యలను చెప్పుకోవడానికి వస్తారు. అలాగే కార్యకర్తలే మా బలం అలాంటి వారిని ఇబ్బంది పెట్టద్దు ఈయన పోలీసులకు సూచించారు
ఇక పార్టీ కార్యాలయంలో ఈయన మీడియా చిట్ చాట్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ చేసే పోరుబాటు గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానం చెబుతూ గత ప్రభుత్వ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో భాగంగా జగన్ మూడు వేల కోట్లు బకాయిలు పెట్టారని తెలిపారు అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 800 కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. వారే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టి ఇప్పుడు వారే పోరుబాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని లోకేష్ తెలిపారు.