సాధారణంగా మహిళలు బొద్దింకని చూస్తేనే భయపడి కిలోమీటరు దూరంగా పారిపోతారు. పాములను చూస్తే మగవారు సైతం చాలా మంది భయపడతారు .కానీ ఓ మహిళ మాత్రం ఏ మాత్రం భయపడకుండా.. పాములను ఇట్టే పట్టేస్తోంది.పాములను పట్టడమే కాకుండా వాటిని రక్షించి కాపాడుతుంది . ఆ మహిళ చీరకట్టులో ఉండి కూడా పాములను చాలా తేలికగా చేతుల్లోకి తీసుకుని జౌరా అనిపిస్తున్నారు. ఇక, ఆమె ఒకరి ఇంట్లో దూరిన పామును పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో తీసిన వీడియో.. గత మూడు రోజులుగా సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
కర్ణాటక : కర్ణాటకలోని బెల్గాంకు చెందిన నిర్జరా చిట్టి అలవోకగా పాములను బంధిస్తారు. ఒక రోజు బంధువుల ఇంట్లో వివాహ కార్యక్రమానికి బయలుదేరిన సమయంలోనే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమ ఇంట్లో పాము దూరిందని.. మీ సాయం కావాలని బాధితులు నిర్జరాకు విషయాన్ని వివరించారు. ఆ సమయంలో నిర్జరా చీరకట్టులో బాగా ముస్తాబై ఉన్నారు. అయినప్పట్టికీ అవేమీ పట్టించుకోకుండా.. ఘటన స్థలానికి చేరుకున్నారు. తన చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకున్నా.. అక్కడ ఉన్న కర్ర సాయంతో కప్‌బోర్డ్స్ మధ్య చిక్కిన పామును పట్టుకునే పనిలో పడ్డారు. చాలా సులువుగా పామును బంధించి.. తన చేతుల్లోకి తీసుకున్నారు. అయితే చీరకట్టులో ఉన్నప్పుడు పామును పట్టుకోవడం అనేది కొద్దిగా కష్టమైన పని అని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఏ మాత్రం భయపడకుండా ఆమె పామును పట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ట్విటర్ మాత్రమే కాకుండా పలు సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు నిర్జరపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈమె వందల పాముల్ని పట్టి కాపాడిన వీడియోస్ యూట్యూబ్ లో వారి ఛానల్ లో ఉన్నాయి కానీ ఈ వీడియో మాత్రమే వైరల్ అయ్యింది.
Virat Bhagini, a snake catcher, was dressed to attend a wedding when she was called to catch a snake in a home. She did it without any special equipment with perfect poise in a saree. pic.twitter.com/uSQEhtqIbA
— Dr. Ajayita (@DoctorAjayita) September 12, 2020