Crime: తాజాగా ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ కొత్త తల్లి వాని పాలెం లో అర్ధరాత్రి సమయంలో ఆటోడ్రైవర్ పిల్లి పైడిరాజు దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితులను ఆనందపురం పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఆటో డ్రైవర్ పిల్లి పైడిరాజు భార్య అప్పలకొండమ్మ ఆశ కార్యకర్తగా పని చేస్తోంది. వీరిద్దరికీ 10 ఏళ్ల క్రితం పెళ్లయింది.ఈ దంపతులకు ఇంటర్ చదివే కుమార్తె రోహిణి, పదవ తరగతి చదువుతున్న కుమారుడి శ్రవణ్ కూడా ఉన్నారు. ఇక పైడిరాజు మద్యం గంజాయి కి బానిస అయ్యి మద్యం తాగి వచ్చి తన భార్యను మానసికంగా శారీరకంగా హింసించేవాడు.
అంతేకాకుండా మోకాళ్లపై నిలబెట్టడం, గంజాయి పీల్చే స్నేహితులను అర్ధరాత్రి సమయంలో ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి సపర్యలు చేయమంటూ ఆమెను హింసించేవాడు. అంతటితో ఆగకుండా ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. అలాగే ఊరిలో అందరి తో గొడవ పడుతూ కట్టుకున్న భార్యకు, కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేసేవాడు. ఇక భర్త ప్రవర్తన తో విసుగు చెందిన భార్య తన పుట్టింటి వారి సహాయంతో ఆమె హత్య చేయించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకుంది. తన తమ్ముడు ఇంకొందరు వ్యక్తులతో కలసి 2.5 లక్షల కుప్పం కుదుర్చుకొని ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె తెలిపింది.