ప్రియుడికి ఓ రేంజ్ లో ముద్దులు పెట్టింది.. చివరికి ఊహించని ట్విస్ట్?

ప్రేమ అనే రెండు అక్షరాల పదం మనుషులను ఎంతదూరమైనా నడిపిస్తుంది. ఒక మనిషి కోసం చంపడానికి అయినా చావడానికైనా సిద్ధం అనే విధంగా ప్రేమ అన్న పదం చేస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఘటన వింటే నిజంగా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఒక ప్రియురాలు తన ప్రియుడు దూరం అవుతున్నాడన్న కారణంతో తనపై ముద్దుల వర్షం కురిపించి అనంతరం అతడి చంపడానికి సిద్ధపడింది. అయితే ఆ యువకుడు అదృష్టవశాత్తు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. భయంకరమైన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూల బర్ధమాన్ జిల్లాలోని కత్వా పోలీస్ స్టేషన్ పరిధి కేసియా గ్రామంలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు వెల్లడించారు. ఆ యువకుడు తనను ప్రేమించిన యువతి వయస్సు 22 ఏళ్ళు అని తెలిపాడు. వారిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, అయితే కొద్ది నెలల కిందట ఆ యువకుడు ఉద్యోగం కోసం జార్ఖండ్ వెళ్లిందని తెలిపాడు. ఇటీవల తన స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆ యువతి తన ప్రియుడికి ఫోన్ చేసి స్థానిక సర్కస్ మైదానంలో కలుసుకుందామని అక్కడికి రమ్మని చెప్పింది.

అక్కడికి ఆ యువకుడు చేరుకున్న తరువాత అతడిని కౌగిలించుకుని ముద్దుల మీద ముద్దులు పెట్టింది. వారిద్దరూ కలిసి సరదాగా సిగరెట్ తాగిన తర్వాత, ఇంతలోనే హఠాత్తుగా తన వెంట తెచ్చుకున్న తుపాకీని తీసి కాల్పులు జరిపిందని, వెంటనే యువకుడు కేకలు వేయడంతో అక్కడి నుంచి ఆమె యువతి పరార్ అయిందని తెలిపాడు. అదృష్టవశాత్తు బుల్లెట్ అతడి పొత్తికడుపుకు తాకుతూ వెళ్లడంతో అతడి కొద్దిలో ఆ ప్రమాదం నుంచి బయట పడ్డాడు అని తెలిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న తుపాకీని, బుల్లెట్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న సంబంధాన్ని కూడా పట్టించుకోకుండా తనను దూరం పెడుతున్నాడన్న కారణంతో కాల్పులకు పాల్పడినట్లు ఆమె వెల్లడించింది. ఆ తర్వాత ఆ యువకుడు మైదానంలో జరిగిన మొత్తం పోలీసులకు వివరించారు.