ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకు కూడా చాలామంది కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఆ గొడవలు కాస్త పెద్దగా మారి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంటాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్లో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది రాఖీ పండుగ రోజున సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఇంట్లో నల్లా ఆఫ్ చేయలేదన్న కారణంతో కోడలు తమ అత్త తో సహా ముగ్గురు కుటుంబ సభ్యులను కత్తితో పొడిచే దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమ బెంగాల్ లో హౌరాలోని ఎంసీ ఘోస్ లేన్ వద్ద బుధవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఇంట్లో అందరూ రాఖీ పండుగ జరుపుకుంటుండగా నిమిషాలలో వాతావరణం మారిపోయింది. పల్లవి ఘోష్ అనే మహిళ తన తోటి కోడలు కుటుంబంతో కలసి రాఖీ పండుగ జరుపుకుంటున్న క్రమంలో కుటుంబంలో చిన్న గొడవ జరిగింది. ఆ సమయంలోనే ఇంట్లో కింద పోర్షన్ లో నల్ల తిప్పి ఉండటంతో నీళ్ళు మోత్తం వృథా అవుతున్నాయి. దీంతో పల్లవికి బాగా కోపం రావటంతో తోటి కోడలితో గొడవ పడింది. ఆ సమయంలో అత్త సర్దిచెప్పటానికి ప్రయత్నించగా ఆమె మీద కత్తితో దాడి చేసింది.
ఆ సమయంలో పల్లవి తోటి కోడలు, ఆమె భర్త, కూతురు రావటంతో పల్లవి వారిమీద కూడా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం గురించి సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా నలుగురి మృతదేహాలు రక్తం మడుగులో పడి ఉన్నాయి. దీంతో పోలిసులు పల్లవిని విచారించగా తానే కత్తితో దాడి చేశానని నేరం అంగీకరించింది. అనారోగ్యం వల్ల రోజు ఎక్కువ మందులు వాడటం వల్ల తాను ఏం చేస్తుందో తనకే తెలియలేదని పల్లవి పోలీసులకి వెల్లడించింది. అంతే కాకుండా తన తోటి కోడలు, అత్త ఎప్పుడు మాటలతో తనను వేదిస్తు ఉంటారని పోలీసుల విచారణలో వెల్లదించింది. దీంతో పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. ఈ ఘటన జరగటంతో పల్లవి భర్త పరారీ లో ఉన్నాడు.