ప్రభుత్వ ఒక నిర్ణయం తీసుకోని దానిని అమలు చేయాలంటే దాని వెనుక చాలా కసరత్తులు జరుపుతుంది. ముఖ్యంగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు, కానీ తాజాగా ఏపీ సీఎం జగన్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని గమనిస్తే ఎక్కడో పొరపాటు జరిగిందని సృష్టంగా తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది స్కూల్ ఏవి ఓపెన్ కాలేదు, చాలా చోట్ల స్కూల్ రీఓపెన్ చేయాలంటే భయపడుతున్నారు, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం నవంబర్ 2 నుండి స్కూల్స్ తెరిచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటంతో భయంభయంగానే స్కూల్స్ ఓపెన్ చేశారు, భయంభయంగానే తల్లిదండ్రులు విద్యార్థులను స్కూల్స్ కు పంపించారు.
స్కూల్ మొదలైన మొదటిరోజే రాష్ట్ర వ్యాప్తంగా 70మందికి కరోనా సోకినట్లు బయటపడింది. తగిన జాగ్రత్తలు తీసుకున్న కానీ కరోనా ను నివారించలేకపోయారు. కర్ణాటక, మహారాష్ట్ర లో ఈ ఏడాది మొత్తం విద్యార్థులకు సెలవలు ప్రకటించారు, కానీ ఆంధ్ర లో మాత్రం బడులు తెరవటంపై మొదటి నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థుల జీవితాలను బలిపెట్టి స్కూల్స్ ను ఓపెన్ చేయవల్సిన అవసరం ఏమొచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు జరపాలంటే కరోనా తీవ్ర స్థాయిలో ఉంటే ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని వాదిస్తున్న జగన్ సర్కార్, పిల్లల విషయంలో మాత్రం కరోనా ను పరిగణలోకి తీసుకోకపోవటం విచారకరం.
ప్రతి విద్యార్థికి నేను మేనమామను అని చెపుతున్న జగన్ గారు ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో స్కూల్ ఓపెన్ చేయటంతో ఏపీ లో కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందా అనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సీఎం జగన్ ఈ విషయంలో మరోసారి అలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయం విద్యార్థి తల్లిదండ్రుల నుండి వినిపిస్తుంది.