Radhe Shyam Effect : ఇన్సైడ్ టాక్ : “రాధే శ్యామ్” ఎఫెక్ట్ తో ప్రభాస్ ఆ సినిమాని రిజెక్ట్ చేసేసాడా..?

Radhe Shyam Effect : అనుకోని రీతిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి మళ్ళీ ఊహించని షాక్ తగిలింది. రాజమౌళి లాంటి స్టార్ దర్శకునితో రెండు భారీ హిట్స్ తీసి తర్వాత రెండు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా కొత్త దర్శకులు యంగ్ దర్శకులుతోనే అది కావడం ఒకింత ఆసక్తిగా మారింది.

ఇక్కడ కొత్త పాత అని పక్కన పెడితే స్టార్ దర్శకులు చిన్న దర్శకులు అనే మాట ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది మేజర్ గా అయితే స్టార్ దర్శకులు కాకపోవడం వల్లే రాధే శ్యామ్ మరియు సాహో సినిమాలు ప్లాప్ అయ్యాయని చాలా మేర అందరి అభిప్రాయం.

దీనితో ప్రభాస్ తన సినిమాల పట్ల మరింత కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాడని అందుకే ఆల్రెడీ తాను ఓకే చెప్పిన ఓ దర్శకుడి సినిమాని ఇప్పుడు రిజెక్ట్ చేసేశాడని షాకింగ్ రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఆ సినిమానే దర్శకుడు మారుతి తో ప్లాన్ చేసిన చిత్రం.

దీనిపై టాక్ వచ్చినపుడే అంత పాజిటివ్ టాక్ ఎక్కడా రాలేదు. దీనితో ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ ఎఫెక్ట్ మూలానే దర్శకుడు మారుతి తో సినిమా వదిలేసాడని బోగట్టా.. కానీ ఉండులో అయితే ఇంకా ఎలాంటి నిజం లేదని చెప్పాలి. సో అధికారిక ప్రకటన ఏమన్నా వస్తుందేమో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ప్రభాస్ ఏం చేస్తాడో అనేది.