ప్రభాస్ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్డేట్

ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ డేట్స్ దొరకడం చాలా కష్టం. కానీ, మారుతీ లాంటి చిన్న డైరెక్టర్ తో అతి తక్కువ రోజుల్లో సినిమా పూర్తిచేసేలా ప్రభాస్ ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే ఈ వార్త ప్రభాస్ ఫాన్స్ కి అంత గా నచ్చలేదు. పైగా మారుతీ గోపీచంద్ తో తీసిన ‘పక్క కమర్షియల్’ సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇటీవల ఆగస్టు 25న సైలెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించబోతున్నారు. వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్ డేట్ ట్రెండ్ అవుతోంది.

హారర్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఒక పాడుపడిన థియేటర్ లో మొత్తం కథ జరుగుతుంది. అందుకే ఈ మూవీ కి ఈ మూవీకి ‘రాజా డీలక్స్’ అని టైటిల్ పెట్టారని తెలుస్తోంది. ఇందు కోసం ఓ స్టూడియోలో భారీ సెట్ ని రెడీ చేస్తున్నారట.

కేవలం రెండే రెండు షెడ్యూల్ లలో ఈ మూవీని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. అనుష్క, శ్రీలీల తో పాటు మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉంది ఈ సినిమాలో.