KGF Chapter 2 Prabhas Fans : “కేజీఎఫ్ 2” సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు రాబోతున్నాయా?అదెలా అంటే.!

KGF Chapter 2 Prabhas Fans

KGF Chapter 2 Prabhas Fans : ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దండెత్తడానికి సిద్ధంగా ఉన్న మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2”. శాండిల్ వుడ్ కి చెందిన స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రీసెంట్ బిగ్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్(RRR) ని మించి అంచనాలతో రిలీజ్ కి వస్తుంది.

మొత్తం అన్ని భాషల్లో కూడా భారీ స్థాయి అంచనాలు ఈ సినిమాపై నెలకొనగా ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం చూస్తున్నారు. అయితే నిన్నటి నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా తో కలిపి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాని తెరకెక్కిన దర్శకుడే మళ్ళీ ప్రభాస్ తో నెక్స్ట్ “సలార్” అనే మరో మహా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

దీనితో ఆ సినిమాపై కూడా ఊహించని లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. అయితే మరి కేజీఎఫ్ సినిమా వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ ఏంటి అనుకుంటున్నారా? ఉంది ఆ మేటర్ ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ తో ఆ “సలార్” కి చెందిన ఒక 25 సెకండ్ల టీజర్ వీడియోని యాడ్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తుంది.

దీనితో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ ట్రీట్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. దీనిపై మాత్రం ఒక అధికారిక అనౌన్సమెంట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మొత్తం కేజీఎఫ్ యూనిట్ నే తెరకెక్కిస్తున్నారు.