మంచి ట్విస్టే.. మెగాస్టార్ సరసన ఐటెం గర్ల్ గా ఈ యంగ్ హీరోయిన్.!

ప్రెజెంట్ టాలీవుడ్ లో రాబోతున్న మంచి క్రేజీ మల్టీ స్టారర్ సినిమాల్లో “ఆచార్య” కూడా ఒకటి. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి అలాగే చిరు కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన భారీ సినిమా ఇది. టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి చిత్ర బృందం రీసెంట్ గా అనౌన్స్ చేసిన మరో బిగ్ అనౌన్సమెంట్ ని ఇప్పుడు రివీల్ చేశారు.

#Acharya​ - Saana Kastam Song Promo | Megastar Chiranjeevi, Ram Charan​, Kajal | KoratalaSiva

 

ఈ సినిమా నుంచి మూడో సాంగ్ గా “సానా కష్టం” పాట ప్రోమోని రిలీజ్ చేశారు. అవ్వడానికి చిన్న బిట్ అయినా సూపర్ గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చిరు మాస్ వింటేజ్ స్టెప్పులు ఒకెత్తు అయితే ఇందులో ఊహించని హీరోయిన్ కనిపించింది. ఆమెనే రెజీనా కసాండ్రా. అసలు ఈ హీరోయిన్ మెగాస్టార్ సరసన స్క్రీన్ పంచుకుంటుంది అనే విషయమే ఎవరికీ తెలీదు.

మరి ఈ సాంగ్ లో మాత్రం ఈ యంగ్ హీరోయిన్ ఐటెం గర్ల్ గా బాగానే కనిపిస్తుంది. చిరు పక్క సిజ్లింగ్ స్టెప్పులు వేసింది. మరి ఈ ట్విస్ట్ మంచి ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు ఈ సినిమాలో చిరు, చరణ్ ల సరసన నటించారు.