Priya Prakash Varrier : భలే ఛాన్స్ కొట్టేసిన వింక్ బ్యూటీ..ఈ సారైనా బౌన్స్ బ్యాక్ అవుతుందా.?

Priya Prakash Varrier : ఒక్క వీడియోతో రాత్రికి రాత్రి వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయిన ముద్దుగుమ్మ ప్రియాప్రకాష్ వారియర్. కన్ను గీటి కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టి.. అబ్బో.! ఈ పాప చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఆ రచ్చతో ఇంకేముంది ప్రియా ప్రకాష్ వారియర్ సినిమాల్లో తెగ బిజీ అయిపోతుందనుకున్నారంతా.
ఆఫర్లు అయితే వచ్చాయ్ కానీ, ప్రియా ప్రకాష్ వారియర్‌కి ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. తెలుగులో నితిన్ సరసన బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటించింది. కానీ, రెండు సినిమాలూ బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టాయ్.
అలాగే కన్నడలోనూ ఆ వీడియో ఎఫెక్ట్‌తో ఆఫర్లు బాగానే అందుకుంది కానీ, అక్కడా సక్సెస్ కాలేదీ అమ్మడు.
ఇక, ఇప్పుడు మళ్లీ ఏం మ్యాజిక్ చేసిందో ఏమో కానీ, డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో ఛాన్స్ దక్కించుకుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్‌తో ఓ స్పెషల్ సాంగ్ వుందట.
పూరీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే మూవులుగా వుండదు. ఎలా దక్కిందో ఏమో కానీ, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ బంపర్ ఆఫర్ దక్కించేసుకుంది. అసలే ప్యాన్ ఇండియా మూవీ.
సో ఈ స్పెషల్ ఆఫర్‌తో కన్నడ కుట్టీ ప్రియా ప్రకాష్ వారియర్ మళ్లీ తెలుగు తెరపై హొయలొలికిస్తుందేమో చూడాలి మరి.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో ‘లైగర్’ సినిమా రూపొందుతోంది.