ఆంధ్ర ప్రదేశ్ లో తమకంటూ సొంత బలగం ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ పార్టీ ఎప్పటి నుండో చూస్తుంది, కానీ చంద్రబాబు లాంటి బలమైన నేత ఉండటంతో వాళ్ళకి ఆ ఛాన్స్ రాలేదు, రాలేదు అనటం కంటే బాబు రానివ్వలేదనే చెప్పాలి, వెంకయ్య నాయుడు ప్రత్యేక రాజకీయాల్లో ఉన్నంత కాలం చంద్రబాబుతో చెలిమి కోసమే ఎదురుచూశాడు తప్పితే, సొంతగా ఎదగాలని బావించలేదని బీజేపీ నేతలే కొన్ని సమయాల్లో చెప్పుకొచ్చారు. వెంకయ్య ఉప రాష్ట్రపతి అయినా తర్వాత ఆంధ్ర బీజేపీ లో చాలా వేగంగానే మార్పు కనిపించింది.
ఈ మార్పులో కూడా చంద్రబాబు ఇంఫులెన్సు ఉన్న విషయం బీజేపీ నేతలు గ్రహించలేకపోయారు. అయితే ఎట్టకేలకు బాబు ఉచ్చులో నుండి బయటకు రావటానికి ట్రై చేసిన బీజేపీ కొంచం సక్సెస్ అయిందనే చెప్పాలి. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు అధ్యక్షుడు కావటమే బీజేపీ లో అది పెద్ద మార్పు అని చెప్పుకోవాలి. సోము అధ్యక్షుడు కాకముందే చంద్రబాబు తెలివిగా తన జనాన్ని బీజేపీ లోకి పంపించాడు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పల్లకి మోసిన బాబు, ఎన్నికల తర్వాత బీజేపీ పల్లకి మోయటానికి అనుకూలంగా తన బోయలను కాషాయ దళంలోకి పంపించాడు.
ఇవన్నీ గమనించిన సోము ఈ మధ్య కాలంలో బీజేపీ లో టీడీపీ వాయిస్ వినిపించే నేతలను పార్టీ నుండి పంపించాడు, మరికొందరు ఉన్నకాని వాళ్ళని పంపించే సత్తా సోముకు లేదు. అధ్యక్షుడికి కూడా అందని స్థాయిలో ఆయా నేతలు పాతుకుపోయారు, వాళ్ళని ఉపయోగించుకొని ఎలాగోలా బీజేపీతో జత కట్టాలని బాబు చూస్తున్నాడు. అదే కనుక జరిగితే బీజేపీ ఆంధ్ర లో సొంతగా ఎదగటం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. మర్రిచెట్టు నీడలో మరో వృక్షము ఎదగనట్లే, బాబుతో జత కట్టిన పార్టీలు ఎదగవు అనే సామెత కూడా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటారు.
అందుకే సోము వీర్రాజు ఎలాగైనా సరే బాబు బీజేపీతో కలవకూడదనే ఉద్దేశ్యంతో టీడీపీ మీద విమర్శలు చేస్తూ, బీజేపీ కి బాబుకి దూరం పెరిగేలా చేస్తున్నాడు, కానీ మరో పక్క బాబు మాత్రం బీజేపీ విషయంలో తన నిజాయితీ చూపించుకోవటమే పనిగా పెట్టుకున్నాడు, బీజేపీ పార్టీని పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్త పడుతూ, వాళ్ళ ప్రాపకం కోసం సాగిలపడుతున్నాడు, ఇవన్నీ చూసి బాబును మరోసారి నమ్మితే బీజేపీ నావ మునిగినట్లే, బాబును ఆపగలిగితే మాత్రం ఆంధ్రాలో బీజేపీ పుంజుకోవచ్చనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు కూడా చెపుతున్నారు. మరి బాబును అడ్డుకోగలిగే శక్తి సోము వీర్రాజు కు ఉందో లేదో చూడాలి