ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అధికారికంగా పెద్ద పెద్ద పదవులు చేపట్టకపోయిన కానీ, అయన కు రాజకీయంగా మంచి పేరు ఉందంటే దానికి కారణం ఆయన వ్యాక్చాతుర్యం, కేవలం తన వాక్పటిమతోనే రాజకీయంగా పైకి ఎదిగాడు ఉండవల్లి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బాగా దగ్గరి వ్యక్తిగా మెలిగాడు. వైఎస్ ప్రోద్బలంతో ఈనాడు రామోజీరావు మీద కోర్టు కేసులు వేసి, రామోజీరావు ను ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తిగా ఉండవల్లి కి పేరుంది.
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ తో పెద్దగా కలవకపోయిన కానీ, మా వైఎస్ కొడుకు అంటూ జగన్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. రాష్ట్రంలో అటు కమ్మ సామజిక వర్గంతో, ఇటు రెడ్డి సామజిక వర్గంతో ఉండవల్లి సఖ్యత కలిగి ఉంటాడు, వైఎస్ అంటే అభిమానం కాబట్టి, ఒక మెట్టు రెడ్డి సామాజిక వర్గం అంటేనే ఉండవల్లి కి కొంచం ఇష్టం. అయితే ఈ మధ్య ఉండవల్లి మీద రెడ్డి సామాజిక వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి కారణం మొన్న ఉండవల్లి పెట్టిన ప్రెస్ మీట్.
ఉండవల్లి ప్రెస్ మీట్ పెడితే యావత్తు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు దానిని గమనిస్తారు, పెద్ద పెద మీడియా సంస్థలు లైవ్ కవరేజ్ ఇస్తాయి, అలాంటి ప్రెస్ మీట్ లో ఉండవల్లి సీఎం జగన్ కి కొంచం వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది, అదే సమయంలో అనుకూలంగా కూడా మాట్లాడాడు. సుప్రీంకోర్టు జడ్జీల మీద ఆరోపణలు చేస్తూ లేఖలు రాయటం కొత్తేమి కాదు, గతంలో కూడా అలాగే జరిగాయని చెప్పటం జగన్ కు అనుకూలమైతే, వైఎస్ వివేకానంద్ రెడ్డి హత్య కేసు విషయాన్నీ తెరపైకి తీసుకోని రావటం జగన్ కు వ్యతిరేకం అయ్యింది.
వివేకా హత్య కేసులో ఇదే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కదా..అప్పుడు స్వాగతించిన నువ్వు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటూ మాట్లాడిన ఉండవల్లి అదే క్రమంలో జగన్ మీద కేసులు విచారణ జరుగుతున్నాయి కదా, ఆ తర్వాత ఎలాంటి శిక్షలు పడుతాయో చూద్దాం, అదే వైఎస్ బ్రతికివుంటే ఆయనే మొదటి నిందితుడు అయ్యేవాడంటూ ఉండవల్లి చెప్పటంతో రెడ్డి సామాజిక వర్గానికి అది నచ్చలేదు. దీనితో ఆయన్ను దూరం పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది, ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం ఉండవల్లికి దూరం పెట్టింది, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం కూడా ఉండవల్లికి దూరం పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.