వైసీపీకి మోదుగుల షాక్ ఇవ్వనున్నాడా..?

modugula jagan

 అధికారంలో ఉన్న పార్టీ నుండి ఇతర పార్టీలోకి జంపింగ్ చేసే నేతలు చాలా తక్కువ , అయితే మోదుగుల వేణుగోపాల్ మాత్రం వైసీపీ నుండి బయటకు వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. 2009 లో టీడీపీ నుండి రాజకీయ ప్రవేశం చేసిన మోదుగుల 2014 లో తనకు మంత్రి పదవి రాబోతుందని అనుకున్నాడు, గెలిచిన తర్వాత చంద్రబాబు మోదుగులను పట్టించుకోలేదు. ఐదేళ్లు అధికారం వుంది కాబట్టి ఎలాగోలా టీడీపీ లోనే వుండిపోయాడు మోదుగుల. 2019 ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచుకున్నాడు. టీడీపీలో ఉంటే తనను పట్టించుకోరని, అందుకే వైసీపీ లోకి వచ్చానని చెప్పుకొచ్చాడు.

modugula venu gopal telugu rrajyam

  ఈ క్రమంలో గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసి గల్లా జయదేవ్ చేతిలో ఓడిపోయాడు. దీనితో కొద్దీ రోజులు సైలెంట్ గా వుండిపోయిన మోదుగుల, ఇప్పుడు తనకు ఎదో ఒక పదవీ కావాలని అడుగుతున్నాడు. ముఖ్యంగా రాజ్యసభ సీటు, లేకపోతే ఎమ్మెల్సీ సీటైనా దక్కించుకోవాలని అనుకున్నాడు. కానీ వైస్సార్సీపీ నుండి మోదుగుల ఎలాంటి సానుకూలమైన సమాచారం రాలేదు. దీనితో మోదుగుల అలకబూనినట్లు తెలుస్తుంది. రెడ్డి ప్రభుత్వం ఉంటే తనకు పదవులు వస్తాయని వైసీపీ లోకి వస్తే, ఇక్కడ కూడా సరైన గౌరవం దక్కటం లేదని బాధపడిపోతున్నట్లు తెలుస్తుంది.

  మరోపక్క ఏపీ లో బీజేపీ బలపడాలని చూస్తుంది. ఇప్పటికే కాపు వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో వుంది. అదే విధంగా రెడ్డి సామాజిక వర్గానికి కూడా దగ్గర కావాలని చూస్తుంది. అందుకే రాష్ట్రంలో రెడ్డి నాయకులను తమ పార్టీలోకి తీసుకోవాలని చూస్తుంది. మోదుగుల వైసీపీ మీద వ్యతిరేకంగా ఉండటంతో అతన్ని బీజేపీ లోకి తీసుకోని రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 నాటికీ ఏపీ లో బలమైన రాజకీయ పార్టీగా ఎదిగి, వైసీపీ కి తామే సరైన పోటీదారులమని నిరూపించుకోవాలంటే మోదుగుల లాంటి నేతల అవసరం బీజేపీ కి వుంది. ఇటు పక్క మోదుగుల కూడా బీజేపీ లో చేరటం పై సానుకూలంగా ఉన్నాడు. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరి నాటికీ లేదా, వచ్చే ఏడాది మొదటిలో మోదుగుల కాషాయం కండువా కప్పుకునే అవకాశం లేకపోలేదు.