మహేష్ బాబు ఈసారైనా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా.. ఆందోళన చెందుతున్న అభిమానులు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వరుస బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా తర్వాత మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయినప్పటికీ ఇంకా సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం జరుపుకోనుంది.

ఇకపోతే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే ప్రేక్షకులు ఒకవైపు ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నప్పటికీ మరోవైపు అభిమానులను ఒక సెంటిమెంట్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.ఇదివరకే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఖలేజా అతడు వంటి సినిమాలు తెరకెక్కాయి. ఇక ఈ సినిమా థియేటర్లో పెద్దగా ప్రేక్షకులను సందడి చేయ లేకపోయినప్పటికీ టీవీలో మాత్రం అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నాయి.

ఈ క్రమంలోనే ముచ్చటగా మూడో సారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా విషయంలో కూడా ఇలాగే కొనసాగుతుందా లేకపోతే మహేష్ బాబు ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా అనే విషయం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అభిమానులు ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు ఈ సెంటిమెంట్ వారిని వెంటాడుతూ ఆందోళనకు గురిచేస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. బుట్ట బొమ్మ లక్ అయిన మహేష్ బాబు త్రివిక్రమ్ సెంటిమెంటును బ్రేక్ చేస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.