జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టాడు. అందులో ముఖ్యమైనది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక భూములను పరిగణలోకి తీసుకున్నారు, ప్రభుత్వా భూమి లేనిచోట ప్రభుత్వమే భూమి కొని పంచటానికి సిద్ధమైంది, కానీ ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకి పడటం లేదు. స్థలాల పంపిణి విషయంలో ప్రభుత్వానికి కోర్టు నుండి అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
తాజాగా ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేద్దామని మార్కింగ్ చేసి హద్దురాళ్లు పాతేసిన ఏపీ సర్కార్‌కు.. హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎక్కడెక్కడ ఆలయ భూముల్ని తీసుకున్నారో.. వాటిని పంచడాన్ని ఆపేయాలని ఆదేశించింది. విజయనగరం జిల్లా గుంపం అనే గ్రామంలోఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు కేటాయించింంది ప్రభుత్వం. ఆ గ్రామస్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం వినలేదు . దాంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చే నిబంధన.. ఎక్కడ ఉందని ప్రభుత్వం తరపు లాయర్‌ను ప్రశ్నించింది
4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని .. అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని అధికారులను ఆదేశించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోసమంటూ.. ఏపీ సర్కార్.. మైనింగ్ భూములు.. ఆవ భూములు.. చెరువు భూములు.. స్మశానం భూములు ఇలా ప్రతీ వాటిని సేకరించేసింది. అయితే ఇలాంటి భూములపై ఆయా గ్రామాల వాసులు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్న ఇలాంటి స్థలాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను లబ్ధిదారులు అమ్ముకోవచ్చంటూ.. ఆఫర్ ఇచ్చారు. అయితే ఇలా ఇవ్వడం అసైన్డ్ చట్టం కింద సాధ్యం కాదు. డీ పట్టాల రూపంలో ఇస్తే సమస్యే రాదు.
కానీ ప్రభుత్వం అడీ పట్టాల రూపంలో ఇవ్వకుండా… కోర్టులు అడ్డుకుంటున్నాయంటూ ప్రచారం ప్రారంభించారు. చట్టానికి లోబడి పనులు చేస్తే కోర్టు నుండి ఎలాంటి ఇబ్బందులు రావు, ఆ విషయం జగన్ సర్కార్ కు తెలియంది కాదు, కానీ ప్రతి విషయంలో చట్టాన్ని అతిక్రమించి పనులు మొదలపెట్టటం వాటిపై కోర్టు నుండి చివాట్లు వస్తే, చూడండి మేము మంచి పనులు చేస్తుంటే కోర్టు అడ్డు పడుతుందని చెప్పటం బాగా అలవాటు అయ్యిపోయిందని , ఇళ్ల స్థలాల విషయాన్నీ వచ్చే ఎన్నికల దాక సాగదీసి, అప్పుడు మెల్లగా పట్టాలు పంపిణి చేస్తే ఆ ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చనే ఆలోచనలో వైసీపీ సర్కార్ ఉందేమో అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు