జగన్ ను ఓడించాలంటే అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలా?

972875-jagan-mohan-reddy

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా వైసీపీ సొంతంగానే పోటీ చేస్తుందని చెబుతున్నారు. అయితే జగన్ లో ఉన్న కాన్ఫిడెన్స్ లో పదో వంతు అయినా ఇతర పార్టీల నేతలకు లేకపోవడం గమనార్హం. పవన్ సైతం జగన్ బలవంతుడు అని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం 2019 ఎన్నికల ఫలితాలే 2024లో కూడా రిపీట్ అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్ ను ఓడించాలంటే ఏకంగా బీజేపీతో కూడా పొత్తు ఉండాలని పార్టీల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ పాలన అద్భుతంగా ఉందని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఇతర పార్టీల నేతలు మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిస్థాయిలో ఫెయిలయ్యారు.

జగన్ వైఎస్సార్ ను మించి అద్భుతమైన పాలన సాగిస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కొన్ని విషయాలలో తప్పులు చేస్తున్నా ఆ తప్పులను కూడా రాబోయే రోజుల్లో సరిదిద్దుకునే ఛాన్స్ అయితే ఉంది. రోడ్ల విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో జగన్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ కరెక్ట్ కాదు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ అభివృద్ధికి కూడా కొంతమేర నిధులు కేటాయిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి అవుతుంది. రాజధాని విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ కు జగన్ తెర దించితే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జగన్ తప్పులు జరగకుండా మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.