జగన్ మోహన్ రెడ్డి ఎంట్రీ తో ఏపీ స్వరూపమే మారిపోయింది. న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖను ఏర్పాటు చేసి రాష్ర్టం రూపాన్నే మార్చేసారు. మూడు రాజధానులతోనే రాష్ర్టం అభివృద్ది చెందుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో అమరావతిలో ఆందోళనలు రేగినప్పటికీ వాటిని ఎంత మాత్రం పట్టించుకోకుండా జగన్ సర్కార్ ముందుకు కదులుతోంది. ఇక ఈనెల 16 నుంచే విశాఖ నుంచి జగన్ యంత్రాంగం పనిచేయనుందని ప్రచారం సాగుతోంది. పరిపాలనా రాజధానిలో శంకుస్థాప కార్యక్రమాలు పూర్తి చేసి పాలన మొదలు పెట్టాలని ప్రభుత్వం జోరుగా ముందుకు వెళ్తోంది.
ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎక్కడెక్కడ భవనాలు ఏర్పాటు కానున్నాయని అన్నది ఓ మ్యాప్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం విశాఖలో ఎక్కడ కొలువు దీరనుందని ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది. పరిపాలనా రాజధాని విశాఖే కాబట్టి కచ్చితంగా సచివాలయ నిర్మాణం అనేది విశాఖలోనే జరగనుంది. ప్రభుత్వ శాఖలన్నీ సచివాలయానికి అనుసంధానం అయి ఉంటాయి కాబట్టి! నిర్మాణం అనేది విశాఖలో. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఎక్కడ సచివాలయం ఏర్పాటు చేస్తారు అన్న దానిపై విశాఖ వాసుల్లో హాట్ టాపిక్ గా మారింది.
రాజధాని అభివృద్ధి అంతా విశాఖ-విజయనగరం-భోగాపురం ఎయిర్ పోర్ట్ మధ్యలోనే జరుగుతుంది. అలాగే సాగరతీరం వెంబడి ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనూ అభివృద్ది జరుగుతుంది. తీరం వెంబడి పర్యాటక రంగం వృద్ధిలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోనే సచివాలయ నిర్మాణం చేపడితో బాగుటుంది! అన్నది కొందరి పెద్దల ఆలోచన అన్నట్లు వినిపిస్తోంది. ఇక జగన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కుని విశాఖను పరిపాలనా రాజధానిగా చేసారు. కాబట్టి తన అభిరుచికి తగ్గట్టే ఎంత మాత్రం తగ్గకుండానే రిచ్ గానే సచివాలయాన్ని నిర్మించే అవకాశం కనిపిస్తున్నంది. అదీ తూర్పు సెంటిమెంట్…పర్మినెంట్ రాజధాని విశాఖనే కాబట్టి నిర్మాణం చేపడితే గనుక చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణాన్ని మించేపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. కేసీఆర్ 500 కోట్ల తో కొత్త సచివాలం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. పాత సచివాలయం కూల్చేసి అదే స్థలంలో కొత్త సచివాలయం ఏర్పాటు చేస్తున్నారు.