Film Industry : సినీ పరిశ్రమ పంచాయితీ ఓ కొలిక్కి వచ్చేనా.?

Film Industry : తెలుగు సినీ పరిశ్రమలో ఐక్యత కనిపిస్తుందా.? కనిపించదా.? ఈ విషయమై నేడే ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ‘తెలుగు సినీ కళామతల్లి బిడ్డలం’ అని అందరూ చెబుతుంటారుగానీ, ఎవరికి వారికి ‘ఈగోలు’ వున్నాయిక్కడ. ఇందులో ఇంకోమాటకు తావు లేదు. అందరూ అని కాదుగానీ, కొందరు ప్రత్యేకించి ‘పైత్యం’ ప్రదర్శిస్తున్నారు. అదే సినీ పరిశ్రమకు శాపంగా మారుతోంది.

కరోనా పాండమిక్ నేపథ్యంలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమపై శీతకన్నేయడంతో.. పరిశ్రమ విలవిల్లాడుతోంది. టిక్కెట్ల ధరలు సహా అనేక సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ ప్రముఖులు చర్చిస్తున్నారుగానీ, సమస్యలకు పరిష్కారం దొరకడంలేదు.

తెలంగాణలో లేని సమస్య ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సినీ పరిశ్రమకు వస్తోంది.? అన్న చర్చ సినీ పరిశ్రమలో లోతుగా జరగాలి. కానీ, ఇక్కడ రాజకీయాలు సినీ పరిశ్రమలో విభజనను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమకు సంబంధించి వివిధ విభాగాలు నిర్వహిస్తోన్న సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్నది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

టిక్కెట్ల ధరల తగ్గింపుతో థియేటర్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఆ ప్రభావం నిర్మాణంపై పడుతుంది. నటీనటులకూ ఇబ్బందులు తప్పవు. ఇంకోపక్క, టిక్కెట్ల ధరల పెంపుతో మరో సమస్య వుంది. ప్రేక్షకుడు సినిమాకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరి, ఈ సమస్యలకు పరిష్కారమెలా.?
అసలంటూ పరిశ్రమలో ఐక్యత వుంటే, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. కానీ, ఆ ఐక్యతే కొరవడుతోంది. రాజకీయాలు కావొచ్చు, ఆధిపత్య పోరు కావొచ్చు.. పెద్దరికంపై పట్టుదల కావొచ్చు..

కారణమేదైనా, సినీ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దరిమిలా.. పరిశ్రమ మేలు కోసం ప్రతి ఒక్కరూ తగ్గాల్సిందే.. తప్పుద.!