సింహపురిలో రెడ్ల రాజకీయం ఫలించేనా..?

Chandrababu Naidu Telugu Rajyam

  రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు అనేవి చాలా ముఖ్యమైనవి. గతంలో ఒక్కో నియోజకవర్గం వారీగా సామాజిక సమీకరణాలు లెక్కకట్టి అందుకు తగ్గట్లు వ్యూహాలు రచించేవాళ్ళు, కానీ నేడు జిల్లాల వారీగా ఈ సమీకరణాలు లెక్కించి మరి అందుకు తగ్గ వ్యూహాలు రచించాల్సి వస్తుంది. ఇక సింహపురిగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానిదే పెత్తనం, జిల్లా వ్యాప్తంగా ఆ సామాజిక వర్గం హవా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఆ వర్గాన్ని తన గుప్పిట ఉంచుకొని ఏకంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లిన్ స్వీప్ చేశాడు.

nellore politics telugu rajyam

  ఆ జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ తప్పితే మిగిలిన ఎమ్మెల్యేలు అందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే, అదే సమయంలో చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారాయణను ముందు పెట్టుకొని నెల్లూరు రాజకీయాలను నడిపించి బొక్కబోర్లా పడ్డాడు. మరోసారి అలాంటి తప్పు చేయకూడదని భావిస్తున్న బాబు నెల్లూరు లో టీడీపీ తరుపున రెడ్లను ముందుకి తీసుకోని రావాలని ఉద్దేశ్యంతో ఉన్నారు. పార్టీలో సీనియర్ నేతైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు లో కీలకంగా ఉన్నకాని, ఆ జిల్లాలో బలమైన క్యాడర్ ను తయారుచేయడంలో విఫలమైయ్యాడు. దీనితో బలమైన రెడ్డి నాయకులకు టీడీపీ అధినేత రెడ్ కార్పెట్ పరవటానికి సిద్ధంగా వున్నాడు. ఇక నెల్లూరు టీడీపీ పగ్గాలు రెడ్డి సామాజిక వర్గ నేతకు ఇవ్వాలని అనుకుంటున్నా బాబు.

  నెల్లూరు మాజీ జెడ్పి ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బొమ్మిరెడ్డి ఫ్యామిలీ చాలా ఏళ్లగా రాజకీయంలో ఉంది. మొన్నటిదాకా వైసీపీ లో ఉంటున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి 2019 అసెంబ్లీ టిక్కెట్ కోసం ట్రై చేస్తే, జగన్ నో చెప్పటంతో టీడీపీ గూటికి వచ్చాడు. అయితే అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బొమ్మిరెడ్డికి చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు రెడ్డి నేతలను ముందుకు తీసుకోని రావాలని చూస్తున్న తరుణంలో బొమ్మిరెడ్డి కి కీలక పదవి ఇవ్వనున్నాడు బాబు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ అవలంబిస్తున్న సూత్రాన్నే బాబు ప్రయోగిస్తే అది టీడీపీకి మేలు చేయకపోవచ్చంటూ అక్కడి స్థానిక టీడీపీ నేతలు చెపుతున్నారు. మరి చంద్రబాబు చేస్తున్న రెడ్ల రాజకీయం నెల్లూరులో ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.