టీడీపీ సైకిల్ పంక్చర్ కాకుండా.. పార్టీ పరువు కాపాడటానికి చంద్రబాబు వేసిన పాచిక పారుతుందా.. ?

 

ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే టీడీపీ దాదాపు ఖాళీ అయ్యిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇకపోతే గతేడాది అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ పార్టీ దారుణ పరాజయాన్ని మూట గట్టుకుంది. ఫలితంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ పరిస్దితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ చికిత్సకు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం సంక్షేమ పథకాలతో జనరంజకంగా దూసుకెళుతుండటంతో ఆ పార్టీ నాయకులు టీడీపీలో కొనసాగడానికి విముఖంగా ఉండి వైసీపీ పట్ల ఆకర్శితులు అవుతున్నారు.. దీని ఫలితంగా ఎందరో టీడీపీని వదిలి వైసీపీలో చేరారు..

ఇకపోతే తాజాగా ప్రకటించిన పార్లమెంట్ కమిటీల విషయంలో అధినేత చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రా జిల్లాల్లో పార్టీ వలసలతో ప్రవహిస్తున్న నేపధ్యంలో, ఇలాగైతే కష్టమని భావించి ముందు జాగ్రత్తగా నాయకులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారట.. కానీ ఇప్పటికే చాలా సమయం గడచిపోయింది. ఎందుకంటే వచ్చే నెలలో మరికొంతమంది టీడీపీని వీడుతారని ప్రచారం సాగుతోంది. ఇందులో తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని టాక్. వీరంతా ఓ సీనియర్ నేత నాయకత్వంలో చంద్రబాబుకు గట్టి షాక్ ఇస్తారని కూడా చెబుతున్నారు.. ఇదిలా ఉండగా టీడీపీ అధినాయకత్వం ఉత్తరాంధ్రాలో గోడ దూకుతారు అని ప్రచారంలో ఉన్న నాయకులకే పార్టీ పదవులు కట్టబెట్టి, వారిని చేజారిపోకుండా ముందర కాళ్లకు బంధం వేసే దిశగా వారికి పదవులు ఇచ్చి, పార్టీ వారిని గుర్తించినట్లుగా అధినాయకత్వం చెప్పుకుంటోంది. అలా రేపటి రోజున వీరంతా జారిపోకుండా పదవులతో కళ్ళెం వేశానని టీడీపీ సంబరపడుతోంది..

 

కాగా అధికారంలో ఉన్నపుడే పార్టీ పదవులు అయినా మరేదైనా ఉపయోగపడతాయి. కానీ విపక్షంలో ఉన్నపుడు చేతి చమురు వదిలించుకోవడానికి తప్ప మరెందుకూ పనికిరావు. పైగా పవర్ లో ఉన్న పార్టీకి టార్గెట్ కూడా అవుతారు. మరి ఇలాంటి ఆలోచనలున్న నాయకుల కాళ్లకు, పార్టీ వీడకుండా సంకెళ్లు వేసి, పార్టీ పరువును కాపాడాలని చేస్తున్న చంద్రబాబు ప్రయత్నం ఫలిస్తుందా అంటే, ఆల్ రెడి పగిలిపోయిన సైకిల్ టైర్‌కు ఎన్ని కుట్లు వేస్తే మాత్రం ఏంది.. అందకుండా దూసుకుపోతున్న వైసీపీని పట్టుకోవడం చాలకష్టం అని అంటున్నారట రాజకీయ విశ్లేషకులు..