Bramhini: రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నారా వారి కోడలు…. కీలక పదవిలోకి బ్రాహ్మణి!

Bramhini: ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీ అధికారంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక రాజకీయాలలో అయిన సినిమా ఇండస్ట్రీలో అయిన ఇతర రంగాలలో అయిన వారసత్వం అనేది సర్వసాధారణం ఇక తెలుగుదేశం పార్టీలో కూడా ఈ వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వారసుడుగా నారా లోకేష్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే త్వరలోనే మరో వారసురాలు కూడా రాజకీయాలలోకి రాబోతున్నారని తెలుస్తోంది.

నారా లోకేష్ ఇటీవల కాలంలో ఏ వ్యక్తి కూడా ఎక్కువసార్లు ఒకే పదవిలో ఉండకూడదు అంటూ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే గత పది సంవత్సరాలుగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై తాను ఈ పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ తెలియజేశారు.

ఇక తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షుడు తర్వాత అంత మంచి గుర్తింపు ఉన్న పదవి ఇదే అని చెప్పాలి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోగా నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇకపై తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పడంతో ఈ పదవిని ఎవరికి అప్పగించబోతున్నారు అనే విషయం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తే కనుక ఈ పదవిలో తన మామయ్య సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు అంటూ వార్తలు వచ్చాయి. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు మూడుసార్లు ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే విజయమందుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను బాలకృష్ణకి ఇస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే మరో పేరు కూడా తెరపైకి వచ్చింది నారా వారసురాలిగా నారావారి కోడలు బ్రాహ్మణి సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఈమె రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అందుకోబోతున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. మరి బ్రాహ్మణి రాజకీయాలలోకి వచ్చి ఈ కీలక పదవిని అందుకోబోతున్నారా లేకపోతే బాలయ్య ఈ పదవిని అందుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.