అమిత్ షా పర్యటన తెరాసకు వరం కాబోతుందా..?

Amit-Shah-Hyderabad today

 గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నా తీరును చూస్తే , అసెంబ్లీ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోవటం లేదు. ప్రధానంగా తెరాస మరియు బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ జరుగుతుంది. ఈ రెండు పార్టీలు గెలుపే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నాయి. దుబ్బాక ఇచ్చిన విజయంతో బీజేపీ గ్రేటర్ మీద గట్టిగానే దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్ర నేతలు గ్రేటర్ ఎన్నికల పర్యటనకు వస్తున్నారు.

cm yogi
  

 

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ , ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాద్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, అదే విధంగా కర్ణాటకకు చెందిన అనేక మంది బీజేపీ నేతలు గ్రేటర్ లో పర్యటనలు చేశారు, తాజాగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రావటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే బీజేపీ గ్రేటర్ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకుంటే అర్ధం అవుతుంది.

  బీజేపీ పార్టీ గ్రేటర్ విషయంలో అతిగా దృష్టి పెట్టిందేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కేవలం మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి, కానీ బీజేపీ చేస్తున్న హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్ వుంది. ఇదే విషయాన్నీ సీఎం కేసీఆర్ నిన్నటి సభలో ప్రస్తావిస్తూ, ఈ బక్కోని కొట్టటానికి ఢిల్లీ నుండి వరద మాదిరి వస్తున్నారు, ఏందీ మీ కధ అంటూ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అదే ఆలోచన గ్రేటర్ జనాలకు కూడా వచ్చినట్లు తెలుస్తుంది.

Amit-Shah-Hyderabad today

 బీజేపీ గెలిస్తే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుందని, బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని తెరాస పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. మొదటిలో దానిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ, వరసగా జరుగుతున్నా సంఘటనల నేపథ్యంలో ఆ ఆలోచన రాకమానదు. ఎప్పుడైతే బీజేపీ ప్రధాన పోటీదారి అయ్యిందో రోజుకో వివాదం చెలరేగుతుంది. గతంలో ఎన్నడూ కూడా గ్రేటర్ ఎన్నికలు ఇంత ఉద్రిక్తత వాతావరణంలో జరగలేదు. తాజాగా అమిత్ షా గ్రేటర్ పర్యటనకు వచ్చి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్లి మరి ప్రత్యేక పూజలు చేయటం జరిగింది.

 గ్రేటర్ పరిధిలో ఎన్నో ఆలయాలు ఉన్నకాని వాటికీ కాకుండా పాతబస్తీలో చార్మినార్ దగ్గరున్న ఆ టెంపుల్ కే ఎందుకు వెళ్లినట్లు, మొన్న ఈ మధ్య సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన బండి సంజయ్ కూడా అదే టెంపుల్ కు వెళ్లి సవాల్ చేశాడు , దీనిని బట్టి చూస్తే బీజేపీ యొక్క అజెండా ఏమిటో సృష్టంగా అర్ధం అవుతుంది. మొదటి నుండి తెరాస చెపుతున్న మాటలు ఇప్పుడు మెల్ల మెల్లగా నిజం అవుతున్నాయేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి, బీజేపీ గ్రేటర్ విషయంలో అతి జాగ్రతకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అదే ప్రమాదకరం అయ్యే అవకాశం లేకపోలేదు