వైల్డ్ డాగ్, సుల్తాన్ కలెక్షన్స్ రిపోర్ట్.. సీన్ రివర్స్

Wild Dog, Sulthan collections report
Wild Dog, Sulthan collections report
నిన్న శుక్రవారం నాగార్జున వైల్డ్ డాగ్, కార్తీ సుల్తాన్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  రెండు సినిమాల్లోనూ దేనికీ కూడ పూర్తిస్థాయి పాజిటివ్ టాక్ అయితే లేదు.  వైల్డ్ డాగ్ యావరేజ్ అంటుండగా సుల్తాన్ జస్ట్ ఓకే ఫిల్మ్ అనే టాక్ ఉంది.  ఇక ఈ సినిమాల ఓపెనింగ్స్ విషయానికొస్తే వైల్డ్ డాగ్ కొంత నిరసపరచగా సుల్తాన్ బెటర్ పెర్ఫార్మెన్స్ చూపింది.  వైల్డ్ డాగ్ నైజాంలో 53 లక్షలు, సీడెడ్లో 19 లక్షలు, ఉత్తరాంధ్రలో 16 లక్షలు, ఈస్ట్ 7 లక్షలు, వెస్ట్ 6 లక్షలు, గుంటూరు 7 లక్షలు, నెల్లూరు 5 లక్షలు, కృష్ణ 8 లక్షలు కలిపి 1.21 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది.  అయితే ట్రేడ్ వర్గాలు 1.5 కోట్ల షేర్ వస్తుందనుకోగా 1.21 కోట్ల దగ్గరే ఆగిపోయింది.  
 
ఇక సుల్తాన్ వసూళ్ల విషయానికి వస్తే నైజాం 42 లక్షలు, సీడెడ్లో 18 లక్షలు, ఉత్తరాంధ్రలో 14 లక్షలు, ఈస్ట్ 10 లక్షలు, వెస్ట్ 7.3 లక్షలు, గుంటూరు 10 లక్షలు, నెల్లూరు 5.2 లక్షలు, కృష్ణ 11.5 లక్షలు కలిపి 1.17 కోట్ల షేర్ రాబట్టింది.  కార్తి కెరీర్లో తెలుగునాట ఇదే సెకండ్ హయ్యస్ట్ ఓపెనింగ్.  నిజం చెప్పాలంటే ఊహించినడానికంటే ఎక్కువే రాబట్టింది.  ఇక ఈ సినిమా నరెక్ ఈవెన్ నెంబర్ చూస్తే 7 కోట్ల వరకు ఉంది.  ఇంకొక 10 రోజులు సినిమా పర్వాలేదనే రన్ చూపించినా ఈ మొత్తాన్ని వెనక్కు రాబట్టగలదు.  ఎటొచ్చీ 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉన్న వైల్డ్ డాగ్ సినిమా పరిస్థితే అటు ఇటు అయ్యేలా ఉంది.